షాకింగ్: కేక్ తింటే చాలు.. కిక్కెక్కి కుప్పకూలిపోతాడు!

ABN , First Publish Date - 2021-01-13T01:12:27+05:30 IST

క్ పేరు చెబితే నోరు ఊరని వారు ఎవరుంటారు చెప్పండి! అలాంటి కేక్‌ను తినే అదృష్టాన్ని ఓ వ్యక్తి శాశ్వతంగా కోల్పోయాడు. అతడికి ఉన్న అరుదైన వ్యాధే ఇందుకు కారణం.

షాకింగ్: కేక్ తింటే చాలు.. కిక్కెక్కి కుప్పకూలిపోతాడు!

ఇంటర్నెట్ డెస్క్: కేక్ పేరు చెబితే నోరు ఊరని వారు ఎవరుంటారు చెప్పండి! అలాంటి కేక్‌ను తినే అదృష్టాన్ని ఓ వ్యక్తి శాశ్వతంగా కోల్పోయాడు. అతడికి ఉన్న అరుదైన వ్యాధే ఇందుకు కారణం. దాదాపు 20 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు చెందిన నిక్ కార్సన్ ఈ వింత వ్యాధి బారినపడ్డాడు. ఇక అప్పటినుంచి కేక్ తిన్న కొద్ది నిమిషాలకే అతడికి మద్యం తాగినట్టుగా మైకం కమ్ముతుంది. కొన్ని సందర్భాల్లో అతడు పరిమితికి మించి మద్యం సేవించినట్టు పోలీసులు కూడా పొరపాటు పడ్డారు. గతంలో తాను ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సందర్భంగా ఘాటైన రసాయనాలను పీల్చి మూర్ఛపోయానని, ఆ తరువాత కొన్ని నెలలకు తనలో ఈ వ్యాధి బయటపడిందని నిక్ చెప్పుకొచ్చాడు. 


కేక్‌లో ఉండే కార్బోహైడ్రేట్లు నిక్ పేగుల్లోకి చేరగానే ఆల్కహాల్ కింద మారిపోయి మైకం కమ్ముతుంది. ఈ కారణంగా నిక్ స్పృహతప్పి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వైద్య పరిభాషలో దీన్ని ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్యకు దూరంగా ఉండేందుకు చెక్కరలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉంటాడు. తన వెంట ఎప్పుడూ బ్రీత్ ఎనలైజర్ ఉంచుకుంటాడు. దాని సాయంతో తనలో మద్యం స్థాయిలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాడు. 

Updated Date - 2021-01-13T01:12:27+05:30 IST