Tesla Carను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు.. దూరంగా తీసుకెళ్లి డైనమైట్ పెట్టి పేల్చేశాడు.. అతని ఆగ్రహానికి కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-12-21T16:18:16+05:30 IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఎంతో గిరాకీ ఉంది. విద్యుత్‌తో నడిచే ఈ కార్లను కొనుగోలు చేసేందుకు ఎంతో మంది క్యూ కడుతున్నారు.

Tesla Carను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు.. దూరంగా తీసుకెళ్లి డైనమైట్ పెట్టి పేల్చేశాడు.. అతని ఆగ్రహానికి కారణమేంటంటే..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఎంతో గిరాకీ ఉంది. విద్యుత్‌తో నడిచే ఈ కార్లను కొనుగోలు చేసేందుకు ఎంతో మంది క్యూ కడుతున్నారు. ఎన్నో మంచి ఫీచర్లను కలిగి ఉన్న టెస్లా కార్లు ఇటీవలి కాలంలో సాంకేతిక సమస్యలతో వినియోగదారులను విసిగిస్తున్నాయి. హఠాత్తుగా రోడ్ల మీద ఆగిపోతూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అలా విసిగిపోయిన ఓ వ్యక్తి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారును పేల్చేశాడు. 


ఫిన్‌లాండ్‌లోని కైమెన్‌లాక్సోకి చెందిన కటైనెన్ అనే వ్యక్తి ఇటీవల ఎంతో ఇష్టపడి టెస్లా కారును సొంతం చేసుకున్నాడు. 1500 కిలోమీట‌ర్ల వరకు కారు చాలా అద్భుతంగా ప్రయాణించింది. ఆ త‌రువాత మొరాయించింది. ఆటోమేష‌న్ సిస్టమ్ ఎర్రర్ కారణంగా ఆగిపోయింది. దీంతో కటైనెన్ తన కారును టెస్లా స‌ర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అయితే వారు కారు సర్వీసింగ్ ఖర్చుల కింద 20 వేల యూరోలు (రూ.17 లక్షలు) అడిగారు. అంత మొత్తం ఖర్చు పెట్టి బాగు చేయించడం ఇష్టం లేకపోవడంతో ఆ కారును పేల్చెయ్యాలని కటైనెన్ భావించాడు. 


ఆ కారును జనావాస ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్న జాలా అనే మంచు ప్రాంతానికి తీసుకెళ్లాడు. కారుకు 30 డైనమైట్ స్టిక్స్ అమర్చి పేల్చేశాడు. కారును పేల్చేస్తున్నట్టు ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులకు చెప్పాడు. దాంతో వారు అక్కడకు చేరుకుని ఆ ఘటనను వీడియో తీశారు. కోటి రూపాయలకు పైగానే విలువ కలిగిన ఆ కారును పేల్చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-12-21T16:18:16+05:30 IST