బరితెగించిన పోలీసులు.. ట్రక్కు డ్రైవర్ దగ్గరకెళ్లి.. ‘పైసే నికాల్’ అన్నారు.. లోనుంచి దిగిన వ్యక్తిని చూడగానే వారికి వెన్నులో వణుకు పుట్టి..

ABN , First Publish Date - 2021-11-28T15:40:03+05:30 IST

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని కన్నడ్ చాలీస్‌గ్రామం..

బరితెగించిన పోలీసులు.. ట్రక్కు డ్రైవర్ దగ్గరకెళ్లి.. ‘పైసే నికాల్’ అన్నారు.. లోనుంచి దిగిన వ్యక్తిని చూడగానే వారికి వెన్నులో వణుకు పుట్టి..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని కన్నడ్ చాలీస్‌గ్రామం ఘాట్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యే మంగేష్ చహ్వాణ్‌కు తెలిసింది. దీంతో ఆయన ఈ ఆరోపణల్లోని నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. ఆయన చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌ వీడియోలో.. ముందుగా ఎమ్మెల్యే కొందరు డ్రైవర్లతో మాట్లాడటం కనిపిస్తుంది. వారు ఎమ్మెల్యేతో.. తమ దగ్గర నుంచి ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా రూ. 500 నుంచి రూ. 2000 వరకూ వసూలు చేస్తున్నారని తెలిపారు. 


వీరి మాటలు విన్న ఎమ్మెల్యే ఒక ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటులో కూర్చుని చెక్‌పోస్టు వరకూ వచ్చారు. అక్కడున్న ఒక కానిస్టేబుల్.. ఎమ్మెల్యే ఎక్కిన ట్రక్కును ఆపాడు. కిందకు దిగి రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఎమ్మెల్యే తన దగ్గర రూ. 300 మాత్రమే ఉన్నాయని వాటిని ఇస్తానన్నారు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఇంతలో మరోకానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. అతను ఎమ్మల్యేను దుర్బాషలాడాడు. దీంతో ఎమ్మెల్యే వాహనం నుంచి దిగారు. అతనిని గుర్తించిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న ఔరంగాబాద్ పోలీసుల బృందం అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించింది. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లందరినీ విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగేష్ మాట్లాడుతూ తాను అక్రమాలకు పాల్పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నానని, ఇక్కడి అధికార ఫ్రభుత్వంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎంతటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఇప్పుడు బయటపడిందన్నారు. 

Updated Date - 2021-11-28T15:40:03+05:30 IST