ప్రియురాలితో మాట్లాడేందుకు వెళ్లిన ప్రియుడు.. నడీరోడ్డుపై షాకింగ్ సీన్.. దీంతో వేడుక చూసిన జనం.. పోలీసుల ఎంట్రీతో

ABN , First Publish Date - 2022-01-01T01:38:10+05:30 IST

ఆ ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. బంగారం, బుజ్జి అంటూ చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే ప్రియురాలితో మాట్లాడేందుకని ఆ ప్రియుడు ఆమె ఉండే ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే నడీరోడ్డుపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ప్రియురాలితో మాట్లాడేందుకు వెళ్లిన ప్రియుడు.. నడీరోడ్డుపై షాకింగ్ సీన్.. దీంతో వేడుక చూసిన జనం.. పోలీసుల ఎంట్రీతో

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. బంగారం, బుజ్జి అంటూ చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే ప్రియురాలితో మాట్లాడేందుకని ఆ ప్రియుడు ఆమె ఉండే ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే నడీరోడ్డుపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..బిహార్‌లోని చప్రా ప్రాంతానికి చెందిన అమ్మాయి.. హజిపూర్‌కు యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. మూడేళ్లుగా చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి మరో అబ్బాయితో మాట్లాడటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయం మాట్లాడేందుకని.. హజిపూర్ నుంచి చప్రా ప్రాంతానికి చేరుకున్నాడు. రోడ్డుపై కలిసిన వెంటనే సదరు యువకుడు.. ప్రియురాలి దగ్గర నేరుగా మరో అబ్బాయి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అతడిని చితకబాదింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న జనం.. అక్కడే ఆగి వేడుక చూశారు. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.. ఆ యువతి, యువకుడు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 
Updated Date - 2022-01-01T01:38:10+05:30 IST