బాత్రూంలోకి నెట్టి తలుపులు వేసి రోజుల తరబడి పస్తులు.. భర్త చేసిన పాపం భరించలేక ఓ భార్య నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2021-12-16T17:49:37+05:30 IST

ఒక వ్యక్తి తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.. వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించిందని ఆమెను చిత్రహింసలు పెట్టాడు..

బాత్రూంలోకి నెట్టి తలుపులు వేసి రోజుల తరబడి పస్తులు.. భర్త చేసిన పాపం భరించలేక ఓ భార్య నిర్ణయమిదీ..!

ఒక వ్యక్తి తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.. వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించిందని ఆమెను చిత్రహింసలు పెట్టాడు.. ఆమె నుంచి పిల్లలను వేరు చేశాడు.. ఆమెను బాత్రూమ్‌లోకి నెట్టి తలుపులు వేసేసి రోజుల తరబడి పస్తులు ఉంచాడు.. ఎలాగో అక్కడ నుంచి తప్పించుకున్న మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


పాలి జిల్లాలోని అకేలి గ్రామానికి చెందిన రఘురాజ్ సింగ్ అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2009లో ఇతను జ్యోతి కన్వర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యకు తెలియకుండా రఘురాజ్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం రెండు నెలల కిందట జ్యోతికి తెలిసింది. భర్తను నిలదీసింది. దీంతో రఘురాజ్ ఆమెను చిత్రహింసలు పెట్టాడు. రోజూ కొట్టేవాడు. ఈ నెల 1వ తేదీన పిల్లలను తన సోదరి ఇంటికి పంపేశాడు. 


ఆమెను ఇంటి బాత్రూమ్‌లోకి నెట్టేసి తాళం వేశాడు. నాలుగు రోజుల పాటు తాళం తీయకుండా ఆమెను పస్తులు ఉంచాడు. ఈ నెల పదో తేదీన బయటపడిన ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. అతను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే పని చేస్తుండడంతో ఆ ఫిర్యాదు వల్ల ఆమెకేం ఉపయోగం కనపడలేదు. తనకు న్యాయం జరిగే అవకాశం లేదని తెలియడంతో ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. రైలు కింద పడి చనిపోయింది. భర్త, అత్తింటి వారి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2021-12-16T17:49:37+05:30 IST