నేనెందుకు చనిపోతున్నానో నా భార్యే చెప్తుంది.. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోకూడదు.. ఓ భర్త సూసైడ్ లేఖ ఇది..!

ABN , First Publish Date - 2021-06-22T03:13:55+05:30 IST

ముస్లిం యువతిని వివాహం చేసుకున్న ఓ హిందూ యువకుడు బంధువుల, స్నేహితుల సూటిపోటి మాటలను తట్టుకోలేకపోయాడు

నేనెందుకు చనిపోతున్నానో నా భార్యే చెప్తుంది.. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోకూడదు.. ఓ భర్త సూసైడ్ లేఖ ఇది..!

ముస్లిం యువతిని వివాహం చేసుకున్న ఓ హిందూ యువకుడు బంధువుల, స్నేహితుల సూటిపోటి మాటలను తట్టుకోలేకపోయాడు. తన భార్య గర్భవతి అని తెలిసి కూడా, పుట్టబోయే బిడ్డను కూడా చూడకుండా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో దొరికిన సూసైడ్ నోట్ అక్కడున్న అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఆ లేఖలో ఏముందంటే.. `నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మృతదేహాన్ని ఇంటికి చేర్చండి. నా భార్య పేరు మరియం బానో. ప్రస్తుతం ఆమె తన తండ్రి మహ్మద్ అజాద్ ఇంటి వద్ద ఉంది. నా మృతదేహాన్ని ఆమెకే అప్పగించండి. ఆమే నా అంత్యక్రియలు చేయాలి. నాకేం జరిగిందో, నేనెందుకు చనిపోయానో నా భార్య చెబుతుంది. `మరియం.. ఐ లవ్యూ. నేను చనిపోయినా ఎప్పుడూ నీతోనే ఉంటా. మన ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డను నువ్వు కనాలి. నువ్వు మళ్లీ పెళ్ళి చేసుకోవద్దు`` అని ఆ లేఖలో ఉంది. చనిపోయిన వ్యక్తిని భూపేంద్ర యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. సన్నిహితులకు, బంధువులకు సమాచారం అందించారు. మతాంతర వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడం వల్లే భూపేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.  


Updated Date - 2021-06-22T03:13:55+05:30 IST