YouTube వీడియోలు చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన బాలిక...షాకైన తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2021-10-28T15:02:02+05:30 IST

పొరుగింటి వ్యక్తి వల్ల గర్భం దాల్చిన ఓ బాలిక ఇంట్లోని ఓ గదిలో యూట్యూబ్ వీడియోలు చూస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన...

YouTube వీడియోలు చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన బాలిక...షాకైన తల్లిదండ్రులు

తిరువనంతపురం(కేరళ): పొరుగింటి వ్యక్తి వల్ల గర్భం దాల్చిన ఓ బాలిక ఇంట్లోని ఓ గదిలో యూట్యూబ్ వీడియోలు చూస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.మలప్పురం జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికపై పొరుగింట్లో ఉన్న 21 ఏళ్ల యువకుడు అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. కుమార్తె గర్భం దాల్చినా తల్లిదండ్రులకు తెలియలేదని పోలీసులు చెప్పారు. బాలిక తల్లికి దృష్టిలోపం ఉండగా, తండ్రి సెక్యూరిటీగార్డుగా రాత్రి డ్యూటీలో నిత్యం బయటే ఉంటాడని పోలీసులు చెప్పారు. 


గర్భం దాల్చిన బాలిక ఇంట్లోని ఓ గదిలోపల ఉండి యూట్యూబ్ వీడియోలు చూస్తూ పాపకు జన్మనిచ్చింది. బిడ్డను ప్రసవించిన తర్వాత బొడ్డు తాడును ఎలా కత్తిరించాలో తెలుసుకోవడానికి తాను యూట్యూబ్ వీడియోలను చూశానని బాలిక చెప్పింది. ఇంట్లోని ఓ గదిలో తన కుమార్తె బిడ్డకు జన్మనిచ్చిన విషయం మూడు రోజుల వరకు తల్లిదండ్రులకు తెలియలేదు. కుమార్తె ఆన్ లైన్ తరగతుల కోసం గదిలో తాళం వేసుకొని ఉంటుందని తల్లి భావించింది.



 ప్రసవం అనంతరం బాలికకు ఇన్ఫెక్షన్ సోకడంతో దృష్టిలోపం ఉన్న తల్లి మూడు రోజుల తర్వాత చూసి తల్లీ బిడ్డను ఆసుపత్రికి తీసుకువెళ్లింది. తల్లీ బిడ్డలు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. టీనేజ్ బాలిక గర్భం దాల్చడం గురించి ఆసుపత్రి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించింది, అనంతరం సీడబ్ల్యూసీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-10-28T15:02:02+05:30 IST