కర్ణాటక పోలీసులు saffron వస్త్రాలు ధరించారు...

ABN , First Publish Date - 2021-10-19T14:40:14+05:30 IST

కర్ణాటక పోలీసులు కాషాయ రంగు దుస్తులు ధరించిన ఘటన రాజకీయ తుపాన్ సృష్టించింది....

కర్ణాటక పోలీసులు saffron వస్త్రాలు ధరించారు...

బెంగళూరు: కర్ణాటక పోలీసులు కాషాయ రంగు దుస్తులు ధరించిన ఘటన రాజకీయ తుపాన్ సృష్టించింది.విజయదశమి సందర్భంగా విజయపుర, ఉడిపి పోలీసు అధికారులు కాషాయ వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విట్టరులో పెట్టారు. దీంతో కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రాన్ని ఉత్తర‌ప్రదేశ్ లాంటి జంగిల్‌రాజ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. విజయదశమి సందర్భంగా అక్టోబరు 14వతేదీన విజయపుర ఎస్పీ సహా పోలీసులు కాషాయ షర్టు, తెల్లని లుంగీలు ధరించి మెడలో కాషాయ కండువాలు వేసుకొని కనిపించారు. అదేవిధంగా ఉడిపిలోని కౌప్ పోలీసుస్టేషనులో కాషాయచొక్కాలు, తెల్లటి ధోతిలు ధరించారు. మహిళా పోలీసు అధికారిణులు కూడా కాషాయ చీరలు ధరించి ఫొటోల్లో దర్శనమిచ్చారు.


కర్ణాటకను ఉత్తర ప్రదేశ్ లాంటి జంగిల్ రాజ్ గా మార్చడానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య ఆరోపించడంతో ఈ ఫొటోలు రాజకీయ దుమారం రేపాయి.ఈ ఘటనపై సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.‘‘మీరు పోలీసుల యూనిఫామ్‌లను మాత్రమే ఎందుకు మార్చారు, మిస్టర్ బొమ్మాయ్.. వారికి త్రిశూలం ఇచ్చి హింసాకాండకు అనుమతి ఇవ్వండి. ఆ విధంగా, జంగిల్ రాజ్ స్థాపించాలనే మీ కల పూర్తి అవుతుంది’’అని సిద్దరామయ్య అన్నారు.


కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా పోలీసు అధికారులు కాషాయ రంగు దుస్తులు వేసుకున్న విషయంపై మాట్లాడారు. ‘‘మా పోలీసు బలగాలు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండాలి, కాని రాజకీయంగా కాషాయరంగు దుస్తులు వేసుకోవడం ద్వారా కర్ణాటక పోలీసులు ఏం చెప్పదల్చుకున్నారని ప్రశ్నిస్తున్నాను’’ అని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. కర్ణాటక పోలీసులు కాషాయరంగు వస్త్రాలు ధరించడం వెనుక ఆంతర్యమేమిటని మరో కాంగ్రెస్ నేత రామలింగా రెడ్డి  ప్రశ్నించారు.‘‘ఇప్పటివరకు సంఘ పరివార్ సిద్ధాంతాలను తన వెనుక డోర్ ద్వారా అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలనలోని అన్ని విభాగాల్లో సంఘ్ పరివార్ యొక్క నీడను నేరుగా వ్యాప్తి చేస్తోంది. స్టేషన్ల వెలుపల పోలీసులు కాషాయరంగు బట్టలు ఆడటం వెనుక ఉద్ధేశం ఏమిటని కర్ణాటక మాజీ హోంశాఖ మంత్రి ప్రశ్నించారు.


Updated Date - 2021-10-19T14:40:14+05:30 IST