మెట్రో స్టేషన్ వద్ద ఇలా చేసి.. కేవలం 3 గంటల్లోనే జాబ్ ఆఫర్ కొట్టేశాడు!
ABN , First Publish Date - 2021-11-28T22:34:42+05:30 IST
సాధారణంగా అందరూ ఉన్నత చదువులను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం వెతుక్కునే పనిలో పడతారు. తమ సీవీని పలు కంపెనీలకు పంపుతూ.. జాబ్ కావాలని కోరుతారు. కానీ ఓ యువకుడు మాత్రం అం

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా అందరూ ఉన్నత చదువులను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం వెతుక్కునే పనిలో పడతారు. తమ సీవీని పలు కంపెనీలకు పంపుతూ.. జాబ్ కావాలని కోరుతారు. కానీ ఓ యువకుడు మాత్రం అందరిలా చేయలేదు. కాస్త వెరైటీగా ఆలోచించాడు. మెట్రోస్టేషన్ వద్దకు వెళ్లి.. అక్కడ ఓ చిన్న పని చేశాడు. అంతే.. మూడంటే మూడు గంటల్లో ఇంటర్యూకి రావాలంటూ అతడికి ఫోన్ వచ్చింది. దీంతో అతడు చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్‌కు చెందిన హైదర్ మాలిక్ (24) చిన్నతనంలోనే కుటుంబ సభ్యులతో కలిసి యూకేకు వలస వెళ్లాడు. ఆ క్రమంలోనే అతడు.. Middlesex Universityలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత జాబ్ కోసం వేట ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడే.. ప్రపంచంపై కరోనా పంజా విసిరింది. దీంతో అతడికి ఎక్కడా జాబ్ దొరకలేదు. ఈ క్రమంలోనే అతడు ఈసారి కొత్తగా ఆలోచించాడు.
స్థానికంగా ఉన్న మెట్రోస్టేషన్‌కు వెళ్లి, తన వివరాలతో కూడిన ఓ ప్లకార్డు ప్రదర్శించాడు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన ప్రయాణికులకు తన రెస్యూమ్ కాపీలను అందించాడు. ఈ క్రమంలో కేవలం 3 గంటల్లోనే ఇంటర్యూకి రావాలంటూ అతడికి పిలుపొచ్చింది. ఆ తర్వాత మూడు రోజుల్లోనే అతడికి ఉద్యోగం కూడా వచ్చింది. కాగా.. మెట్రోస్టేషన్‌లో అతడు ప్రదర్శించిన ప్లకార్డుకు సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది.