పట్ట పగలు కేవలం 15 నిమిషాల్లో కోటి దొంగతనం.. అసలు ఎలా జరిగిదంటే..

ABN , First Publish Date - 2021-10-25T11:48:53+05:30 IST

బీహార్లోని వైశాలీ జిల్లాలో ఒక దొంగల ముఠా పట్టపగలే ఒక నగల దుకాణాన్ని లూటీ చేసింది. అది కూడా జనం ఉండగా.. కేవలం 15 నిమిషాల మెరుపు వేగంతో దొంగతనం చేశారు. పోలీసులకు సమాచారం అందగా పరుగు పరుగున అక్కడకు...

పట్ట పగలు కేవలం 15 నిమిషాల్లో కోటి దొంగతనం.. అసలు ఎలా జరిగిదంటే..

బీహార్లోని వైశాలీ జిల్లాలో ఒక దొంగల ముఠా పట్టపగలే ఒక నగల దుకాణాన్ని లూటీ చేసింది. అది కూడా జనం ఉండగా.. కేవలం 15 నిమిషాల మెరుపు వేగంతో దొంగతనం చేశారు. పోలీసులకు సమాచారం అందగా పరుగు పరుగున అక్కడకు చేరుకొని.. విషయం తెలిసి తెల్లమొహం వేశారు.


వైశాలీ జిల్లాలో దొంగలకు అడ్డూఆపు లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా దొంగతనం కేసులు ఎక్కువైపోయాయి. పట్టపగలే ఓ ముగ్గురు దొంగలు ఒక నగల దుకాణాన్ని చాలా తెలివిగా లూటీ చేశారు.  జిల్లాలోని బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక నగల దుకాణంలో ముగ్గురు వ్యక్తులు కస్టమర్లుగా ప్రవేశించారు. ముగ్గురు కూడా ముఖానికి మాస్క్ ధరించి ఉన్నారు. అప్పటికే దుకాణంలో చాలా మంది కస్టమర్లు షాపింగ్ చేస్తున్నారు. షాపు ఓనర్‌కి ఆ ముగ్గురు వ్యక్తులని చూసి ఏదో అనుమానం కలిగింది. అయినా.. నవ్వుతూ.. "చెప్పండి సార్.. మీకేం కావాలి?" అని అడిగాడు. 


అప్పుడు వారు కొన్ని నగలు చూపించమని అడిగారు. అలా కాసేపు వాళ్లు చాలా నగలు చూశారు. షాపు ఓనర్ ఒకసారి మీ ముఖం నుంచి మాస్క్ తీయండి? అని అడిగాడు. అప్పుడు వాళ్లు తమ దుస్తులలో దాచుకున్న మూడు గన్లు తీసి గాల్లో బుల్లెట్లు పేల్చారు. ఇది చూసి.. చుట్టు పక్కల ఉన్న జనం భయపడ్డారు. షాపు ఓనర్‌ని గన్‌పాయింట్‌పై పెట్టి నగలు, డబ్బు దోచుకొని వెళ్లిపోతూ.. మళ్లీ వచ్చి సీసీటీవి వీడియో ఎక్కడుందో అడిగి తెలుసుకొని, ఆ వీడియోని, దాని రికార్డర్‌ని నాశనం చేశారు.


ఆ తరువాత పోలీసులు వచ్చి విచారణ చేశారు. షాపు ఓనర్.. కథనం ప్రకారం ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి కస్టమర్లుగా వచ్చారు. గన్‌పాయింట్‌పై బెదిరించి షాపులోని నగలు, డబ్బు దోచుకొని ఒక బైక్‌పై పారిపోయారు. అంచానా ప్రకారం నగలు విలువ ఒక కోటి రూపాయలపైనే ఉంటుందని, డబ్బు రూ. 10 లక్షల వరకూ ఉంటుందని తెలిసింది. నగలలో బంగారం, వెండి, మరికొన్ని వజ్రాల నగలు ఉన్నాయని షాపు ఓనర్ తెలిపాడు.


పోలీసులకు సీసీటీవి వీడియో కూడా లభించకపోవడంతో.. ప్రస్తుతం వాళ్లు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.


Updated Date - 2021-10-25T11:48:53+05:30 IST