శిలువాకారంలో విరబూసిన పుష్పాలు

ABN , First Publish Date - 2021-12-26T17:21:29+05:30 IST

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌లో శిలువాకారంలో విరబూసిన పుష్పాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్‌ పండుగ మాసమైన డిసెంబరులో మాత్రమే

శిలువాకారంలో విరబూసిన పుష్పాలు

                         - కొడైకెనాల్‌ పర్వత శ్రేణుల్లో అద్భుతం


చెన్నై: తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌లో శిలువాకారంలో విరబూసిన పుష్పాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్‌ పండుగ మాసమైన డిసెంబరులో మాత్రమే విరబూసే ఈ పుష్పాలను వీక్షించేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. పర్వతశ్రేణులు అధికంగా వున్న కొడైకెనాల్‌లో చలి, మంచుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు దేశవిదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. ఇక్కడి బ్రయాన్‌ పార్కుతో పాటు నివాస ప్రాంతాల్లో డిసెంబరు మాసంలో మాత్రమే శిలువాకారంలో పుష్పాలు విరబూస్తుంటాయి. పసుపు, ఎరుపు, నలుపు రంగుల కలయికతో పుష్పించిన ఈ పూలు ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. అతి శీతల ప్రాంతాల్లో మాత్రమే పూసే ఈ పూలు ఫ్రెంచ్‌, వెనిజులా, కొలంబియా, బ్రెజిల్‌ దేశాలలో అధికంగా వుంటాయని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-26T17:21:29+05:30 IST