ఈ బండి.. ఎగురుతుందండి..!

ABN , First Publish Date - 2021-10-28T07:36:37+05:30 IST

బైక్‌పై ఎంతసేపూ రోడ్డుపై వెళ్లడమేనా.. సరదాగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది..? అలా వెళ్లాలంటే ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న బైక్‌ను కొనుగోలు..

ఈ బండి.. ఎగురుతుందండి..!

  • హోవర్‌ బైక్‌ తయారు చేసిన జపాన్‌ సంస్థ
  • ధర రూ. 5.10 కోట్లు!

బైక్‌పై ఎంతసేపూ రోడ్డుపై వెళ్లడమేనా.. సరదాగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది..? అలా వెళ్లాలంటే ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న బైక్‌ను కొనుగోలు చేస్తే సరి! జపాన్‌కు చెందిన ఏఎల్‌ఐ టెక్నాలజీస్‌ అనే స్టార్టప్‌ సంస్థ దీన్ని తయారుచేసింది. దీని పేరు ‘ఎక్‌టూరిస్మో’ హోవర్‌బైక్‌. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 40 నిమిషాల పాటు ఈ బైక్‌ ఎగరగలదు. త్వరలో పూర్తి విద్యుత్తుతో నడిచేలా కూడా మరో బైకును విడుదల చేయనుంది. తాజాగా ఫ్యూజీలోని గ్రాండ్‌స్టాండ్‌లో ఈ హోవర్‌బైక్‌ను ఏఎల్‌ఐ సంస్థ ప్రదర్శించింది. అంతా బాగానే ఉన్నా.. ఈ బైకుల్లో ఒక చిన్న సమస్య ఉంది. మొత్తం ఆరు రోటర్‌ బ్లేడ్‌లు ఉండటంతో ఇది గాల్లో ఎగిరితే.. చెవులు కచ్చితంగా మూసుకోవాల్సిందే. ఇక.. ప్రస్తుతానికి అతి తక్కువగా కేవలం 200 బైకులను మాత్రమే ఏఎల్‌ఐ తయారుచేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్‌ మొదలుపెట్టింది. ఇంతకూ దీని ధర ఎంతో తెలుసా? కేవలం రూ. 5.10 కోట్లు మాత్రమే!

Updated Date - 2021-10-28T07:36:37+05:30 IST