పందులతో జల్లికట్టు ..!

ABN , First Publish Date - 2021-01-20T17:08:43+05:30 IST

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని జల్లికట్టు పోటీలు జరుగుతుండగా, తేని జిల్లా అల్లినగరం ప్రాంతంలో నిర్వహించిన పందుల జల్లికట్టు పోటీలను ...

పందులతో జల్లికట్టు ..!

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని  జల్లికట్టు పోటీలు జరుగుతుండగా, తేని జిల్లా అల్లినగరం ప్రాంతంలో నిర్వహించిన పందుల జల్లికట్టు పోటీలను పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వల్లినగర్‌ ప్రాంతంలో కురువర్‌ వర్గానికి చెందిన 50కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా వన వేంగైగళ్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పందుల జల్లికట్టు నిబంధనలతో నిర్వహించారు.


ఈ పోటీల్లో 70 నుంచి 100 కిలోల బరువున్న పందులు మాత్రమే పాల్గొనాలి. తాటి మానులతో ఏర్పాటు చేసిన వడివాసన్‌ నుంచి పంది మూడడుగుల దూరం వెళ్లిన తర్వాతే దానిని పట్టుకోవాలి. చివరి లైన్‌ దాటేలోపు కేవలం పంది వెనుక కాళ్లు మాత్రమే పట్టుకొని దానిని ఆపాలి. అలా ఆపిన వారు విజేతలుగాను, పట్టుకోకుండా లైన్‌ దాటే పందిని విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటీల్లో తేని, దిండుగల్‌, మదురై జిల్లాల నుంచి 12 పందుల రాగా, 45 మంది యువకులు పాల్గొన్నారు. ఈ వింత జల్లికట్టును వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై,  యువకులను ఉత్సాహపరిచారు.

Updated Date - 2021-01-20T17:08:43+05:30 IST