కుమార్తెకు తండ్రి సెల్యూట్... అరుదైన ఫొటో వైరల్!

ABN , First Publish Date - 2021-08-10T14:39:16+05:30 IST

తల్లిదండ్రులు తమ పిల్లలు తమకన్నా ఉన్నత స్థాయికి...

కుమార్తెకు తండ్రి సెల్యూట్... అరుదైన ఫొటో వైరల్!

న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ పిల్లలు తమకన్నా ఉన్నత స్థాయికి చేరాలని తపనపడుతుంటారు. అదే నిజమైతే వారి ఆనందానికి హద్దులు ఉండవు. ఇటువంటి అరుదైన దృశ్యం ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) పాసింగ్ అవుట్ పరేడ్‌లో కనిపించింది. ఒక ఇన్‌స్పెక్టర్ తన కుమార్తె అయిన అసిస్టెంట్ కమాండెంట్‌కు సెల్యూట్ చేశారు.


ఐటీబీపీలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కమలేష్ కుమార్‌ తన కుమార్తె ఎదుగుదలను చూసి ఉప్పొంగిపోతున్నారు. కమలేష్ కుమార్తె దీక్షా భారత్ ఐటీబీపీలో చేరిన ఇద్దరు మహిళా అధికారులలో ఒకరు. కుమార్తె పరేడ్ లో తన దగ్గరకు వచ్చినప్పుడు కమలేష్ ఆమెను ఒక అధికారి స్థాయిలో చూసి గర్విస్తూ, సెల్యూట్ చేశారు. ఐటీబీపీ 2016లో యూపీఎస్సీ పరీక్ష ద్వారా మహిళలను కమాండర్లుగా ఎంపికచేసింది. వారిలో దీక్ష ఒకరు.

Updated Date - 2021-08-10T14:39:16+05:30 IST