మానవరహిత డ్రోన్ హెలికాప్టర్ అభివృద్ధి...కాన్పూర్ ఐఐటీ సృష్టి

ABN , First Publish Date - 2021-02-05T16:07:42+05:30 IST

కాన్పూర్ నగరంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎండ్యూర్ ఎయిర్ అనే స్టార్టప్ కంపెనీతో కలిసి మానవ రహిత డ్రోన్ హెలికాప్టరును...

మానవరహిత డ్రోన్ హెలికాప్టర్ అభివృద్ధి...కాన్పూర్ ఐఐటీ సృష్టి

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) : కాన్పూర్ నగరంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎండ్యూర్ ఎయిర్ అనే స్టార్టప్ కంపెనీతో కలిసి మానవ రహిత డ్రోన్ హెలికాప్టరును రూపొందించింది.పెట్రోలుతో నడిచే ఈ డ్రోన్ హెలికాప్టరు 5 కిలోల బరువును మోయగలదు. ఈ డ్రోన్ హెలికాప్టరుతో నిఘా ఉంచడంతోపాటు వ్యాక్సిన్ పంపిణీకి కూడా ఉపయోగించవచ్చని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ అభిషేక్ చెప్పారు. డ్రోన్ హెలికాప్టరు 11,500 అడుగుల ఎత్తు వరకు ట్రయల్ విజయవంతం అయిందని ప్రొఫెసర్ చెప్పారు.బ్యాటరీతో నడిచేలా మరింత ఎత్తుకు చేరుకోగల మరో డ్రోన్ హెలికాప్టరు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని,దీన్ని మరో మూడు నెలల్లో తయారు చేస్తామని అభిషేక్ వివరించారు. ఈ డ్రోన్ హెలికాప్టరు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉపయోగించి నడుస్తుందని ప్రొఫెసర్ చెప్పారు. ఈ డ్రోన్ హెలికాప్టరు అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నామని ప్రొఫెసర్ అభిషేక్ వెల్లడించారు. 

Updated Date - 2021-02-05T16:07:42+05:30 IST