5 సార్లు లాటరీలో గెలుపు! 6వ సారి ఏకంగా..

ABN , First Publish Date - 2021-02-02T03:07:26+05:30 IST

అదృష్టం ఎప్పుడోగానీ తలుపు తట్టదు.. దురదృష్టం తలపు తెరిచే దాకా వదిలిపెట్టదని సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తనకు ఈ సూత్రం అస్సలు వర్తించదని రుజువు చేశాడు.

5 సార్లు లాటరీలో గెలుపు! 6వ సారి ఏకంగా..

వాషింగ్టన్: అదృష్టం ఎప్పుడోగానీ తలుపు తట్టదు.. దురదృష్టం తలుపు తెరిచే దాకా వదిలిపెట్టదని సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తనకు ఈ సూత్రం అస్సలు వర్తించదని రుజువు చేశాడు. ఐడాహో రాష్ట్రానికి చెందిన బ్రియాన్ మోస్ అనే వ్యక్తి ఇప్పటివరకూ ఐదు సార్లు లాటరీలో గెలిచి కొంత మొత్తంలో డబ్బులు గెలుచుకున్నాడు. తాజాగా ఆయనో గేమ్ ఆడుతూ లాటరీలో గెలిచి మనుపెన్నడూ లేని విధంగా 2.5 లక్షల డాలర్లను సొంతం చేసుకున్నాడు. మన కరెన్సీలో ఈ మొత్తం దాదాపు 182 కోట్లకు సమానం. ఇంత సంపదతో ఆయన కులాసాగా విలాస జీవితం గుడుపుతున్నాడంటే మనం పొరబడ్డట్టే. అందుకు పూర్తి విరుద్ధంగా ఆయన ఈ సంపదను సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. తన స్వంత రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల ఏర్పాటుకు వెచ్చిస్తుంటారు. ‘ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని వసతులను మెరుగుపరిచేందుకే నేను ఈ లాటరీల్లో పాల్గొంటున్నా’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-02-02T03:07:26+05:30 IST