హాయిగా సాగిపోతున్న సంసారం.. ఉన్నట్టుండి సంపు నుంచి దుర్వాసన.. చివరకు భర్త నిర్జీవంగా బయటపడడంతో..

ABN , First Publish Date - 2021-12-27T01:37:49+05:30 IST

తమిళనాడు తిరువొత్తియూరు సేలం కిచ్చిపాల్యంకు చెందిన సేతుపతి(33), ప్రియ(30) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏ సమస్యలూ లేకుండా సవ్యంగా సాగిపోతున్న వీరి సంసారంలో ఊహించని ఘటన...

హాయిగా సాగిపోతున్న సంసారం.. ఉన్నట్టుండి సంపు నుంచి దుర్వాసన.. చివరకు భర్త నిర్జీవంగా బయటపడడంతో..
ప్రతీకాత్మక చిత్రం

హాయిగా సాగిపోతున్న సంసారంలో ఒక్కోసారి ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. దంపతుల్లో ఎవరో ఒకరు తప్పులు చేయడం ద్వారా చివరకు సమస్యలు కొనితెచ్చుకుంటూ ఉంటారు. బాగా చూసుకునే భర్తతో పాటూ పిల్లలు ఉన్న కుటుంబంలో భార్యకు ఏలోటూ ఉండదు. కానీ అలాంటి సమయంలో కొందరు మహిళలు వేసే తప్పటడుగులు.. చివరకు సంసారాన్ని నాశనం చేస్తుంటాయి. తమిళనాడులో ఓ కుటుంబంలో ఇలాంటి ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే...


తమిళనాడు తిరువొత్తియూరు సేలం కిచ్చిపాల్యంకు చెందిన సేతుపతి(33), ప్రియ(30) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏ సమస్యలూ లేకుండా సవ్యంగా సాగిపోతున్న వీరి సంసారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న భార్యభర్తల మధ్యలోకి పక్కింట్లో ఉన్న సతీష్ కుమార్ అనే వ్యక్తి ఎంటరయ్యాడు. తరచూ వారింటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రియకు దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు వారి పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు తెలీకుండా పక్కింటి వ్యక్తిని తరచూ కలుస్తూ ఉండేది.

ట్యూషన్‌లో ఉండాల్సిన బాలిక.. అనూహ్యంగా అటవీ ప్రాంతంలో.. అపస్మారక స్థితిలో.. జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్..


ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఓ రోజు ఇద్దరూ కలిసి సేతపతిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నీటి తొట్టెలో పడేశారు. రెండు రోజులు ఎవరికీ అనుమానం రాలేదు. తర్వాత సంపు నుంచి దర్వాసన వస్తుండడంతో స్థానికులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రియ, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆమె చనిపోయి 11నెలలు అయింది.. ఊహించని విధంగా ఇటీవల కొడుకు గదిలో మృతదేహం ప్రత్యక్షం.. చివరకు..

Updated Date - 2021-12-27T01:37:49+05:30 IST