‘నా భార్య షాపింగ్ మోజులో ఇల్లు గుల్లచేస్తోంది..’ ఫిర్యాదు చేసిన భర్తకు.. ఆ ఒక్కపనితో అంతా సెట్ అవుతుందన్న నెటిజన్లు.. అదేంటో తెలిస్తే.. ‘అంతేగా..అంతేగా’ అంటారు!

ABN , First Publish Date - 2021-10-19T16:00:53+05:30 IST

సాధారణంగా ఆడవారికి షాపింగ్ చేయడం అంటే..

‘నా భార్య షాపింగ్ మోజులో ఇల్లు గుల్లచేస్తోంది..’ ఫిర్యాదు చేసిన భర్తకు.. ఆ ఒక్కపనితో అంతా సెట్ అవుతుందన్న నెటిజన్లు.. అదేంటో తెలిస్తే.. ‘అంతేగా..అంతేగా’ అంటారు!

సాధారణంగా ఆడవారికి షాపింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఇటీవలికాలంలో పురుషులు కూడా షాపింగ్ చేసేందుకు వెనుకాడటం లేదు. కానీ షాపింగ్ అనగానే ముందుగా మహిళల పేరే వినిపిస్తుంటుంది. కొంతమంది భార్యాభర్తల మధ్య షాపింగ్ విషయమై తరచూ గొడవలు వస్తుంటాయి. మహిళల షాపింగ్ అలవాటు కారణంగా నెలవారీ బడ్జెట్ పెరిగిపోతున్నదని కొందరు మగవారు గగ్గోలు పెడుతుంటారు. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఆ పోస్టులో ఒక భర్త.. తన భార్య షాపింగ్ పేరిట అధికంగా ఖర్చు చేస్తున్నదని తెలిపాడు. తన వాదనకు అందరూ మద్దతు పలుకుతారని అతను భావించాడు. అయితే దీనికి భిన్నంగా సోషల్ మీడియాలో అతనికి చివాట్లు పడుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. ఒక సోషల్ మీడియా గ్రూపులోని సభ్యులు తమకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ, వాటికి ప్రజల నుంచి సమాధానాలు కోరుతారు. తాజాగా ఈ గ్రూపులోని ఒక సభ్యుడు.. తనకు ఏడాది క్రితమే వివాహం అయ్యిందని, తన భార్య అధికంగా షాపింగ్ చేస్తుంటుందని తెలిపాడు. మేకప్ సమానుతో పాటు డ్రెస్‌లు కొనుగోలు చేస్తుంటుందని వివరించాడు. ఈ విధంగా అనసవరంగా డబ్బు ఖర్చు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. మొదట్లో ఆమెకు అడ్డుచెప్పలేదని, అయితే ఆమె ఏకంగా 41 వేల రూపాయలు పెట్టి ఒక కోటు కొన్నదని, దీంతో తనకు కోపం వచ్చిందన్నాడు. తనకు భారీ మొత్తంలో జీతం రాదని, భార్య చేసే ఖర్చులతో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపాడు. దీంతో తాను ఇంటి ఖర్చుల విషయమై భార్యకు వివరంగా చెప్పానని, అప్పుడు ఆమె తనను విసుక్కుంటూ చూసిందని, తన మాట లేక్కచేయలేదని, ఎంత ప్రయత్నించినా, ఆమెలో మార్పురాలేదని తెలిపాడు.


పైగా అప్పటి నుంచి తన భార్య ఖర్చులను మరింతగా పెంచుకుంటూ పోతూ తనను డామినేట్ చేస్తున్నదని ఆరోపించాడు... ఈ వివరాలు వెల్లడిచిన సదరు భర్త తన సమస్యకు పరిష్కారం చూపాలని నెటిజన్లను కోరాడు. ఈ పోస్టు చూసిన కొందరు నెటిజన్లు.. అతనికి మద్దతు పలుకుతుండగా, మరికొందరు అతని భార్యకు వత్తాసు పలుకుతున్నారు. మరికొందరు ఈ విషయంలో భర్తదే తప్పంటూ పలు సూచనలు చేస్తున్నారు. పెళ్లికి ముందు ఆమె షాపింగ్ అలవాట్లు తెలుసుకోవాలని అంటున్నారు. మరికొందరైతే పిల్లలు పుడితే మహిళలకు ఇటువంటి షాపింగ్ అలవాటు తగ్గుతుందని.. అందుకే ముందుగా ఆ పనిలో ఉండాలని భర్తకు అమూల్యమైన సలహా ఇస్తున్నారు.Updated Date - 2021-10-19T16:00:53+05:30 IST