అదనపు కట్నం కోసం వేధింపులు.. చివరకు భర్త ఎంత పని చేశాడంటే..!

ABN , First Publish Date - 2021-07-24T17:40:39+05:30 IST

పెళ్లి చేసుకుని అత్తింట అడుగు పెట్టిన ఆమెకు భర్త నరకం చూపించాడు..

అదనపు కట్నం కోసం వేధింపులు.. చివరకు భర్త ఎంత పని చేశాడంటే..!

పెళ్లి చేసుకుని అత్తింట అడుగు పెట్టిన ఆమెకు భర్త నరకం చూపించాడు.. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు.. చివరకు ఎంతకు తెగించాడంటే.. తన స్నేహితులతో కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశాడు.. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో జరిగింది. కన్నౌజ్ జిల్లాలోని గుర్షాయ్ ఘంజ్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన నజీమ్ అనే యువకుడితో ఏడాది క్రితం పెళ్లయింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను నజీమ్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు. చివరకు తన స్నేహితులు జుల్ఫికర్, జబ్బార్, సాజిమ్, ఆమిర్‌లతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. వారందరూ ఆమెకు 15 రోజుల పాటు నరకం చూపించారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల గురించి గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-24T17:40:39+05:30 IST