7ఏళ్ల అమ్మాయి ఏడుపు కేకలు విని పరుగెత్తుకెళ్లిన స్థానికులు.. ఎంతపని జరిగిపోయిందంటూ..

ABN , First Publish Date - 2021-12-26T22:12:21+05:30 IST

పక్కింట్లోంచి ఉదయన్నే ఏడేళ్ల అమ్మాయి ఏకధాటిగా ఏడుస్తుండటంతో.. స్థానికులు కంగారుపడ్డారు. ఏం జరిగిందో అనే ఆందోళనతో ఆ పాప ఉన్న ఇంట్లోకి పరుగులు తీశారు. అనంతరం అక్కడ కనిపించిన సీ

7ఏళ్ల అమ్మాయి ఏడుపు కేకలు విని పరుగెత్తుకెళ్లిన స్థానికులు.. ఎంతపని జరిగిపోయిందంటూ..

ఇంటర్నెట్ డెస్క్: పక్కింట్లోంచి ఉదయన్నే ఏడేళ్ల అమ్మాయి ఏకధాటిగా ఏడుస్తుండటంతో.. స్థానికులు కంగారుపడ్డారు. ఏం జరిగిందో అనే ఆందోళనతో ఆ పాప ఉన్న ఇంట్లోకి పరుగులు తీశారు. అనంతరం అక్కడ కనిపించిన సీన్ చేసి నివ్వెరపోయారు. ఎంతపని జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇంతకూ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని కన్పూర్‌కు చెందిన హైదర్ అనే వ్యక్తి పేయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి కొన్నేళ్ల క్రితం చాందిని (27)తో వివాహం జరిగింది. ఈ క్రమంలో వారికి ఇద్దరు కూతూళ్లు జన్మించారు. అయితే  కొంతకాలంగా హైదర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. చాందిని ఎవరితో మాట్లాడినా హైదర్ సహించేవాడు కాదు. ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి చాందినితో గొడవపడ్డాడు. ఆమెను చితకబాది, ఆ తర్వాత గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని గదిలోకి తీసుకెళ్లి, ఇద్దరు కూతుళ్లను అదే గదిలో బంధించి.. అక్కడ నుంచి పరారయ్యాడు. ఉదయాన్నే పిల్లల ఏడుపు చప్పుడు స్థానికులు విని, చాందిని మృతదేహాన్ని చూసి షాకయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. హైదర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 
Updated Date - 2021-12-26T22:12:21+05:30 IST