మానవ శరీరంలో శాస్త్రవేత్తలకు సైతం నేటికీ అంతుచిక్కని రహస్యాలు.. ఈ సమస్యలను మీరూ ఎదుర్కొంటున్నారు!

ABN , First Publish Date - 2021-10-29T14:05:14+05:30 IST

మానవ శరీరంలో అనేక రహస్యాలు దాగున్నాయి..

మానవ శరీరంలో శాస్త్రవేత్తలకు సైతం నేటికీ అంతుచిక్కని రహస్యాలు.. ఈ సమస్యలను మీరూ ఎదుర్కొంటున్నారు!

మానవ శరీరంలో అనేక రహస్యాలు దాగున్నాయి. వీటిని చేధించడంలో సైన్స్ కొంతవరకూ విజయం సాధించింది. మన శరీరంలో ఉన్నట్టుండి నొప్పులు ఎందుకు వస్తాయి?.. ఎక్కళ్లు ఎందుకు వస్తాయి?.. నత్తి ఎందుకు ఏర్పడుతుంది?.. మొదలై విషయాల వెనుకనున్న రహస్యాలను అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు సైతం వెనుకంజలో ఉన్నారు.


శరీరంలో నొప్పులు: మనమందరం ఏదో ఒక సమయంలో శరీరంలోని నొప్పిని భరించవలసి వస్తుంటుంది. వైద్యులు, శాస్త్రవేత్తలు దీని గురించి  బాధితుడిని అడగడం మినహా నొప్పిని తెలుసుకునేందుకు మరోమార్గం లేదు. 

నత్తిగా మాట్లాడటం : నత్తిగా మాట్లాడటం వెనుక శారీరక లేదా మానసిక భావోద్వేగాలు కారణం కావచ్చు. ఒక నివేదిక ప్రకారం.. అసూయ, అభద్రత, ఆందోళన తదితర మానసిక కారణాల వల్ల లేదా తలపై గాయం వంటి శారీరక కారణాల వల్ల కూడా మాట్లాడటంలో సమస్యలు ఏర్పడవచ్చు.

కలలు కనడం: మనమందరం కలలు కంటాం. మనకు గుర్తున్నా లేకున్నా కలలు అనేవి సాధారణం. వ్యాధులు, ఇతర అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే మానవులు కలలు కనే సామర్థ్యాన్ని కోల్పోతారు. దీనికి కారణమేమిటో నేటికీ అంతుచిక్కలేదు


కనురెప్పలు ఆడించడం: మన కళ్ల రక్షణకు రెప్పపాటు అనేది జరుగుతుంటుంది. రెప్పపాటు సమయంలో విశ్రాంతి దొరుకుతుంది. కళ్ళు రెప్పవేయకుండా నిరంతరం తెరుచుకుని ఉండలేవు. 

కోమా: ఈ స్థితిలో నరాలు ప్రతిస్పందనలను కోల్పోతాయి. మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కోమా సమస్య తలెత్తుతుంది. 

ఎక్కిళ్లు: మనం చాలా వేగంగా ఆహారం తిన్నప్పుడు కడుపు.. డయాఫ్రామ్ మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి శరీరం ఎక్కిళ్ళను రక్షణగా ఉపయోగిస్తుంది.

ఏడుపు: ఏడుపు అనేది కళ్లను తేమగా మార్చేందుకు, భావోద్వేగ బాధను తగ్గించడానికి మానవ శరీరం జరిపే చర్య.  కన్నీళ్లు అనేవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి దోహదపడతాయి. కన్నీరు అనేది లేకపోతే కళ్ళు పొడిబారిపోతాయి.

వికారం: వాహనం వేగంగా లేదా మలుపులు తిరుగుతున్న రోడ్లపై వెళుతున్నప్పుడు దానిలో కూర్చున్న మన దృష్టికి మన శరీరానికి మధ్య డిస్‌కనెక్ట్ ఏర్పడుతుంది, ఇది వికారం లేదా వాంతికి దారితీస్తుంది. ఇదేవిధంగా మనం పడవలో లేదా ఓడలో వెళుతున్నప్పుడు కడుపు సంకోచిండచం, జఠర రసాన్ని స్రవించడంలాంటి జీవసంబంధమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ పరిస్థితి వికారానికి, వాంతికి దారితీస్తుంది. 

Updated Date - 2021-10-29T14:05:14+05:30 IST