అర్దరాత్రి ఒంటరిగా ఉన్న వివాహిత ఇంటికి వచ్చిన యువకుడు...అది చూసిన వివాహిత భర్త ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-11-05T17:12:07+05:30 IST

ఓ ఇంటి ముందు దొరికిన స్లిప్పర్ హత్య కేసులో నిందితులను పట్టించిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది....

అర్దరాత్రి ఒంటరిగా ఉన్న వివాహిత ఇంటికి వచ్చిన యువకుడు...అది చూసిన వివాహిత భర్త ఏం చేశాడంటే...

స్లిప్పర్ హత్య కేసులో నిందితుడిని పట్టించింది...పూణే పోలీసులు ఛేదించిన మిస్టరీ

పూణే (మహారాష్ట్ర): ఓ ఇంటి ముందు దొరికిన స్లిప్పర్ హత్య కేసులో నిందితులను పట్టించిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది. అక్టోబరు నెలలో 27 ఏళ్ల ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. పూణే నగరంలోని బవ్ ధాన్ లో నివశిస్తున్న 27 ఏళ్ల తన కుమారుడు అక్టోబరు 22వతేదీన తప్పిపోయినట్లు అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడి కిడ్నాప్ తోపాటు పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతుండగా ఒక ఇంటి ముందు పెరట్లో తప్పిపోయిన యువకుడి చెప్పును పోలీసులు కనుగొన్నారు. 


చెప్పు దొరకడంతో తీగ లాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో యువకుడి హత్యోదంతం బయటపడింది. అదృశ్యమైన యువకుడు మరో వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్టోబర్ 21వతేదీన రాత్రి అతని భార్య ఫోన్‌లో రెండు మిస్డ్ కాల్‌లను గమనించడంతో హత్య జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఫోన్ కాల్స్ యువకుడి మొబైల్ నంబర్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం రాత్రి నిందితుడి భార్యను కలిసేందుకు యువకుడు వచ్చాడు. అప్పుడే నిందితుడు, అతని ఇద్దరు సహచరులు యువకుడి ఛాతీ, పొత్తికడుపుపై ​​కత్తితో పొడిచారు.


అనంతరం ముగ్గురూ యువకుడి మృతదేహాన్ని నిందితుడి పెరట్లోకి తీసుకెళ్లి దహనం చేశారు.  తర్వాత నీటితో ఆ ప్రాంతంలోని అవశేషాలు చెల్లాచెదురు చేశారని పోలీసులు గుర్తించారు.  ఈ హత్య ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పూణెకు చెందిన ఒక సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని, అతని సహాయకుడిని మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు.


Updated Date - 2021-11-05T17:12:07+05:30 IST