తాగుడుకు బానిసైన తండ్రి.. పీకల దాకా తాగొచ్చి.. కూతురని కూడా చూడకుండా..

ABN , First Publish Date - 2021-12-26T02:22:50+05:30 IST

చెన్నైలో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఓ రోజు పీకలదాకా మందు తాగొచ్చి.. కన్నకూతురని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే..

తాగుడుకు బానిసైన తండ్రి.. పీకల దాకా తాగొచ్చి.. కూతురని కూడా చూడకుండా..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. కొందరైతే మద్యానికి బానిసై.. ఆ మత్తులో ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బు కోసం కొందరు దారుణాలకు పాల్పడుతుంటే.. మరికొందరు మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. రోజురోజుకూ సైకోల్లా మారుతున్నారు. ఎన్ని శిక్షలు పడుతున్నా.. వారిలో మాత్రం మార్పు రావడం లేదు. చెన్నైలో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఓ రోజు పీకలదాకా మందు తాగొచ్చి.. కన్నకూతురని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో 37 ఏళ్ల వ్యక్తి.. భార్య, పదేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. దంపతులు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో భర్త తాగుడుకు బానిసయ్యాడు. వచ్చిన ఆదాయాన్నంతా తాగుడుకే ఖర్చు చేసేవాడు. అయినా భార్య మాత్రం ఓపిగ్గా ఉంటూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఇటీవల ఓరోజు భార్య పనికి వెళ్లింది. భర్త మాత్రం రోజంతా పీకలదాకా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో కూతురు ఒక్కటే ఇంట్లో ఉంది.

తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..


కూతురును చూడగానే తనలోని సైకో బయటికొచ్చాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నకూతురిని వక్ర దృష్టితో చూశాడు. బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. భార్య పని నుంచి ఇంటికి రాగానే.. కూతురు ఏడుస్తూ ఉండడాన్ని గమనించింది. ఏమైందమ్మా.. అని ప్రశ్నించగా, తన తండ్రి చేసిన అకృత్యం గురించి తెలియజేసింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య.. వెంటనే పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!

Updated Date - 2021-12-26T02:22:50+05:30 IST