బ్యాచులర్ కుర్రాళ్లకు వింత కష్టం.. జోడీ లేకుంటే ఈ హోటల్‌లోకి ఎంట్రీ లేదట..!

ABN , First Publish Date - 2021-10-20T00:20:23+05:30 IST

ఓ రెస్టారెంట్‌లో దిగులు పడుతూ ఉన్న ఫొటోను.. హర్షితా శర్మ అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే బాగా గమనిస్తే ఆమె విచారణానికి కారణమేమిటో తెలుస్తుంది. ఫొటోలో కనపడుతున్న ఏసీపై ఉన్న పోస్టర్ చూసి అంతా

బ్యాచులర్ కుర్రాళ్లకు వింత కష్టం.. జోడీ లేకుంటే ఈ హోటల్‌లోకి ఎంట్రీ లేదట..!

షాదీ మాటే వద్దు గురూ.. సోలో బతుకే సో బెటరూ.. అంటూ పాట పడుకునేవారు ఈ వార్త వింటే అవాక్కవుతారు. ఎందుకంటే ఆ హోటల్‌లో భోజనం చేయాలంటే.. ఖచ్చితంగా జోడీగా వెళ్లాలట. ఈ హోటల్‌ వారి బోర్డును చూసి.. ఏంటీ భోజనం చేయడానికి కూడా జోడీగా వెళ్లాలా.. అంటూ అంతా నోరెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. ఇదేంటీ.. మరీ విచిత్రంగా ఉందే అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఈ నిర్ణయం సరైనదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. జైపూర్‌లోని ఓ హోటల్ యాజమాన్యం... ఒంటరి పురుషులను అనుమతించడానికి నిరాకరిస్తోంది. వివరాల్లోకి వెళితే..


ఓ రెస్టారెంట్‌లో దిగులు పడుతూ ఉన్న ఫొటోను.. హర్షితా శర్మ అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే బాగా గమనిస్తే ఆమె విచారణానికి కారణమేమిటో తెలుస్తుంది. ఫొటోలో కనపడుతున్న ఏసీపై ఉన్న పోస్టర్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ పురుషులు ఈ హోటల్లోకి అడుగుపెట్టాలంటే జోడీతో రావాల్సిందే’ అని రాయడాన్ని అంతా వింతగా చూస్తున్నారు.  ఈ హోటల్‌లోని దాల్‌- రోటీని తినడం కోసం తనను తోడుగా తీసుకొచ్చాడు అంటూ ట్విట్టర్‌ యూజర్‌.. ఫన్నీగా రాసుకొచ్చింది. అలాగే మరో ట్వీట్‌లో ‘ఇది జైపూర్‌లోని ‘గోపి పవిత్రా భోజనాలయం’. ఇక్కడి ఫుడ్‌ చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి కచ్చితంగా ట్రై చేయండి’ అని పేర్కొంది.Updated Date - 2021-10-20T00:20:23+05:30 IST