దాహంతో అల్లాడిపోయిన ఉడుత.. మనసు ద్రవించే వీడియో!

ABN , First Publish Date - 2021-03-23T00:49:07+05:30 IST

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో షేర్ అయిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను మెలిపెడుతోంది

దాహంతో అల్లాడిపోయిన ఉడుత.. మనసు ద్రవించే వీడియో!

న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో షేర్ అయిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను మెలిపెడుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ పబ్లిసిస్ట్ డేనీ డెరానీ దీనిని ట్వీట్టర్‌లో రీషేర్ చేశారు. 41 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ వ్యక్తి దాహంతో అల్లాడిపోతున్న ఓ ఉడుత పిల్లకు బాటిల్‌తో నీళ్లు పట్టిస్తున్నాడు. దాహం తీరడంతో అది ఎంచక్కా అతడి చేతులపైకి ఎక్కి ప్రేమను కురిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఆ ఉడుత పిల్ల చూపిన కృతజ్ఞతకు ముచ్చటపడిపోతున్నారు.   


ఆన్‌లైన్‌ను చుట్టేస్తున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు రెండు మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఉడుత దాహం తీరుస్తున్న ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ‘ఆ తర్వాత ఏం జరిగింది?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ఆ వ్యక్తి, ఆ ఉడుతపిల్ల ఏమయ్యాయి? వారెక్కడున్నారు? చివరికి ఏమైంది?’ అంటూ ఉత్సుకతను ప్రదర్శించారు. ఆశ్చర్యకరంగా మరో వ్యక్తి ఆ వీడియో రెండో భాగాన్ని ట్వీట్ చేశాడు. అందులో ఆ ఉడుత పిల్ల నీళ్లు పట్టిన వ్యక్తి చేతిలో నిద్రపోతుండగా, అతడు దానిని ప్రేమగా నిమురుతున్నాడు. 

Updated Date - 2021-03-23T00:49:07+05:30 IST