పెళ్లిలో DJ పెట్టడానికి ఒప్పుకోలేదని ఇంట్లోంచి వెళ్లిపోయిన వరుడు.. తర్వాత అతడు చేసిన పని చూసి నివ్వెరపోయిన బంధువులు..

ABN , First Publish Date - 2021-12-26T01:29:29+05:30 IST

పెళ్లి రోజు వరుడు షాకిచ్చాడు. ముహూర్తం సమయానికి గంటల వ్యవధి ఉండగా.. ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వరుడు చేసిన పనికి పెళ్లికి వచ్చిన బంధువులు నివ్వెరపో

పెళ్లిలో DJ పెట్టడానికి ఒప్పుకోలేదని ఇంట్లోంచి వెళ్లిపోయిన వరుడు.. తర్వాత అతడు చేసిన పని చూసి నివ్వెరపోయిన బంధువులు..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి రోజు వరుడు షాకిచ్చాడు. ముహూర్తం సమయానికి గంటల వ్యవధి ఉండగా.. ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వరుడు చేసిన పనికి పెళ్లికి వచ్చిన బంధువులు నివ్వెరపోయారు. ఇంతకూ అతడు చేసిన పని ఏంటి అనే వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని బన్స్వారా ప్రాంతానికి చెందిన వినోద్ (21) అనే యువకుడికి పెళ్లి చేయాలని అతడి కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలోనే ఓ సంబంధాన్ని చూశారు. యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో.. పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పత్రికలను ముద్రించి.. బంధువులు, సన్నిహితులకు పంచారు. ఈ క్రమంలో పెళ్లిలో డీజే ఏర్పాటు చేసేందుకు వినోద్ ప్రయత్నించాడు. అయితే పోలీసులు అంగీకరించకపోవడంతో.. మనస్తాపానికి గురయ్యాడు. మరికొద్ది గంటల్లో పెళ్లనగా.. ఇంట్లోంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. స్థానికుల సహాయంతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రామం అవతల ఓ చెట్టుకి విగత జీవిగా వేలాడుతుండటాన్ని చూసి, ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం గుండెలవిసేలా విలపించారు. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. డీజే ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారనే వాదనను అధికారులు ఖండించారు. 
Updated Date - 2021-12-26T01:29:29+05:30 IST