తల్లి కోసం ప్రభుత్వాస్పత్రిలో వివాహం

ABN , First Publish Date - 2021-10-31T14:49:46+05:30 IST

విల్లుపురం ప్రభుత్వాస్పత్రిలో వివాహం చేసుకొని, కన్న తల్లి ఆశను కొడుకు తీర్చిన ఘటన ఆశ్చర్యా నికి గురిచేసింది. విల్లుపురం తిరుక్కాలు నగర్‌కు చెందిన దయాళన్‌ (40) పదవ తర గతి వరకు చదువుకోగా, ఇంకా వివాహం

తల్లి కోసం ప్రభుత్వాస్పత్రిలో వివాహం

పెరంబూర్‌(Chennai): విల్లుపురం ప్రభుత్వాస్పత్రిలో వివాహం చేసుకొని, కన్న తల్లి ఆశను కొడుకు తీర్చిన ఘటన ఆశ్చర్యా నికి గురిచేసింది. విల్లుపురం తిరుక్కాలు నగర్‌కు చెందిన దయాళన్‌ (40) పదవ తర గతి వరకు చదువుకోగా, ఇంకా వివాహం కాలేదు. దయాళన్‌ తల్లి ముత్తాలమ్మన్‌ (67) రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ లక్షణా లతో విల్లుపురం ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో ప్రమాదస్థితిలో చికిత్సలు పొందు తోంది. కుమారుడికి వివాహం చేయలేకపోయానని ముత్తాలమ్మన్‌ బాధపడు తున్నట్టు వైద్య సిబ్బంది దయాళన్‌కు తెలిపారు. దీంతో, తల్లిని చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన మామ కూతురు గాయత్రి (30)తో దయాళన్‌కు వివాహం చేసేందుకు బంధువులు మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి ప్రవేశద్వారం వద్ద ఉన్న అమ్మన్‌ ఆలయం ముందుకు శుక్రవారం మధ్యాహ్నం 3.45 సమయంలో గాయత్రి మెడలో దయాళన్‌ తాళి కట్టాడు. వధూ వరులు తల్లి ఆశీర్వాదం తీసుకొనేందుకు వార్డులోకి వెళ్లేందుకు యత్నించగా, వైద్య సిబ్బంది అడ్డుకొని వెనక్కి పంపారు. దీంతో, తాను వివాహం చేసుకున్నట్లు తల్లికి తెలపాలని కోరిన దయాళన్‌ భార్యతో ఇంటికెళ్లాడు.

Updated Date - 2021-10-31T14:49:46+05:30 IST