దీపావళికి షాపింగ్ చేయవా..? అంటూ భార్యను తీసుకెళ్లిన భర్త.. తెల్లారేసరికి రోడ్డు పక్కన కారులో ఇద్దరూ శవాలుగా.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-05T22:34:18+05:30 IST

ఆయన ప్రభుత్వ ఉద్యోగి. కొద్ది కొన్నేళ్ల క్రితమే ఓ మహిళను పెళ్లాడాడు. ఈ క్రమంలోనే వారికి ఓ బాబు కూడా జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 14ఏళ్లు. ఆ ప్రభుత్వ ఉద్యోగి వైవాహిక జీవితంలో ఎటువంటి కలహాలకు తావు లేదు.. ఆనందంగా ఆ దంపతు

దీపావళికి షాపింగ్ చేయవా..? అంటూ భార్యను తీసుకెళ్లిన భర్త.. తెల్లారేసరికి రోడ్డు పక్కన కారులో ఇద్దరూ శవాలుగా.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ప్రభుత్వ ఉద్యోగి. కొద్ది కొన్నేళ్ల క్రితమే ఓ మహిళను పెళ్లాడాడు. ఈ క్రమంలోనే వారికి ఓ బాబు కూడా జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 14ఏళ్లు. ఆ ప్రభుత్వ ఉద్యోగి వైవాహిక జీవితంలో ఎటువంటి కలహాలకు తావు లేదు.. ఆనందంగా ఆ దంపతులు తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రోజు దీపావళి సందర్భంగా.. సాయంత్రం ఆయన తన భార్యను షాపింగ్‌కు తీసుకెళ్లాడు. అయితే అనూహ్యంగా తెల్లారేసరికి రోడ్డు పక్కన కారులో ఇద్దరూ శవాలుగా పడున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన మండోలి (38) అనే వ్యక్తి ప్రభుత్వ పాఠాశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయనకు కొన్నేళ్ల క్రితం ఆల్కా (35)తో వివాహం కాగా.. వారికి 14ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా.. మండోలీ రెండు నెలల క్రితమే మక్సీ అనే ప్రాంతానికి తన కుటుంబాన్ని షిప్ట్ చేసి, అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. గురువారం దీపావళి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో మండోలి ఇంట్లోనే ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపాడు. సాయంత్రం అయిన తర్వాత దీపావళి షాపింగ్‌కు వెళ్దాం పదా అంటూ భార్యను ఆల్కాను వెంట బెట్టుకుని మండోలి కారులో బయటకు వెళ్లాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ.. తెల్లారేసరికి రోడ్డు పక్కన కారులో భార్యభర్తలు విగత జీవులుగా పడున్నారు. పెట్రోలింగ్ చేస్తూ అటువైపునకు వచ్చిన పోలీసులు ఆగి ఉన్న కారులో మండోలి, ఆల్కా మృతదేహాలను గుర్తించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. కారులో విషం‌కు సంబంధించిన ప్యాకెట్ బయటపడటంతో.. మండోలి తన భార్యను కత్తితో హత్య చేసిన తర్వాత తాను పాయిజన్ తీసుకుని ప్రాణాలు తీసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మండోలి ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 
Updated Date - 2021-11-05T22:34:18+05:30 IST