నీతో మాట్లాడాలి.. ఓసారి మా ఇంటికి రా.. అంటూ కూతురిని ప్రేమిస్తున్న కుర్రాడికి ఫోన్ చేశాడా తండ్రి.. చివరకు..

ABN , First Publish Date - 2021-08-10T17:27:25+05:30 IST

వారిద్దరూ ప్రేమలో పడ్డారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు..

నీతో మాట్లాడాలి.. ఓసారి మా ఇంటికి రా.. అంటూ కూతురిని ప్రేమిస్తున్న కుర్రాడికి ఫోన్ చేశాడా తండ్రి.. చివరకు..

వారిద్దరూ ప్రేమలో పడ్డారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. అమ్మాయి తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది.. అంతా విన్న తండ్రి ఆ కూతురికి భరోసా కల్పించాడు.. అబ్బాయిని ఇంటికి తీసుకురమ్మన్నాడు.. ఎంతో సంతోషంతో ప్రియురాలి గ్రామానికి వెళ్లిన ప్రియుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.. ప్రియురాలి కుటుంబం చేతిలో దారుణంగా హతమయ్యాడు..  బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది. 


విషంభార్‌పూర్ రూప్‌చాప్ గ్రామ నివాసి అయిన ప్రేమ్ కుమార్ కాలా మతిహానియా గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ యువతి కుటుంబ ఆహ్వానం మేరకు పెళ్లి గురించి మాట్లాడేందుకు ఈ నెల 4వ తేదీన కాలా మతిహానియా వెళ్లాడు. అయితే యువతి కుటుంబ సభ్యులు ప్రేమ్‌ను దారుణంగా కొట్టారు. అనంతరం అతడి తలను నరికేశారు. మొండెం భాగాన్ని గండక్ నదిలోకి విసిరేశారు. 


మృతుడి సోదరుడు బుల్లెట్ కుమార్ యాదవ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించి గండక్ నది నుంచి ప్రేమ్ మొండెం భాగాన్ని వెలికి తీశారు. తల భాగం గురించి అన్వేషణ సాగిస్తున్నారు. యువతి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2021-08-10T17:27:25+05:30 IST