బర్త్ డే రోజు విష్ చేయలేదని మాట్లాడటం మానేసిన ప్రియుడు.. దీంతో ప్రియురాలు షాకింగ్ నిర్ణయం.. విషయం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2021-11-21T16:12:34+05:30 IST

వారిద్దరూ కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలోనే అతడి పుట్టిన రోజు వచ్చింది. దీంతో ప్రియురాలు తనకు బర్త్ డే విషెస్ చెబుతుందని.. ఆ ప్రియుడు రోజంతా ఎదురు చూశాడు. అయితే అతడిని ఆమె విష్ చేయకపోవడంతో.. హర్ట్ అయ్యాడు. ఆమెతో మాట్లా

బర్త్ డే రోజు విష్ చేయలేదని మాట్లాడటం మానేసిన ప్రియుడు.. దీంతో ప్రియురాలు షాకింగ్ నిర్ణయం.. విషయం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

ఇంటర్నెట్ డెస్క్: వారిద్దరూ కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలోనే అతడి పుట్టిన రోజు వచ్చింది. దీంతో ప్రియురాలు తనకు బర్త్ డే విషెస్ చెబుతుందని.. ఆ ప్రియుడు రోజంతా ఎదురు చూశాడు. అయితే అతడిని ఆమె విష్ చేయకపోవడంతో.. హర్ట్ అయ్యాడు. ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీంతో ఆ ప్రియురాలు ఆగ్రహానికి గురైంది. అంతేకాకుండా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంకాగా.. విషయం తెలుసుకుని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌‌కు చెందిన ఓ యువతి, యువకుడు ఒకరినొకరు చూసుకుని తొలి చూపులోనే ప్రేమలో పెడ్డారు. దీంతో కొద్ది రోజులుగా వాళ్లు గాఢప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే అతడి పుట్టిన రోజు వచ్చింది. సాధారణంగా ఏ ప్రియుడైన తన ప్రియురాలు తనకు తొలుత పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటాడు. అలాగే అతడు కూడా భావించాడు. అయితే ప్రియుడికి మాత్రం నిరాశే మిగిలింది. రోజంతా ఎదురు చూసినప్పటికీ.. ప్రియురాలు అతడికి విషెస్ చెప్పకపోవడంతో హర్ట్ అయ్యాడు. దీంతో ఆమెతో మాట్లాడటం మానేశాడు. ప్రియుడు అకస్మాత్తుగా తనతో మాట్లాడం మానేయడంతో ఆమె కంగుతింది. విషయం ఏంటని ఆరా తీసింది. ‘సారీ’ అంటూ మెసేజ్‌లు పంపింది. అయినప్పటికీ అతడి వైఖరిలో మార్పు రాకపోవడంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నేరుగా వెళ్లి ప్రియుడిపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. తనతో మాట్లాడటం లేదని ఫిర్యాదులో పేర్కొంది. ఎలాగైన అతడు.. తనతో మాట్లాడేలా చేయమని కోరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రియుడిని స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం.. ఇద్దరికీ కలిపి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ ప్రేమజంట.. ఆర్యసమాజ్ మందిరంలో పెళ్లి బంధంతో ఒక్కటైంది. అయితే ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. 
Updated Date - 2021-11-21T16:12:34+05:30 IST