బాత్రూమ్‌లోకి వెళ్లి న్యూడ్‌గా మారిపోయి అతడికి వీడియో కాల్ చేసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-28T17:55:55+05:30 IST

దేశంలో ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు..

బాత్రూమ్‌లోకి వెళ్లి న్యూడ్‌గా మారిపోయి అతడికి వీడియో కాల్ చేసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

దేశంలో ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో చోటుచేసుకున్న ఒక సైబర్ క్రైం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయుడి వాట్సాప్ నంబరుకు ఒక యువతి ఫోన్ చేసి, తన అశ్లీల సంభాషణలతో అతనిని ఆకట్టుకుంది. తరువాత బాత్‌రూమ్‌లోకి వెళ్లి, న్యూడ్‌గా మారిపోయి వీడియో కాల్ చేసింది.  ఆ ఉపాధ్యాయునితో సంభాషిస్తూ వీడియో రికార్డు చేసింది. రెండు రోజుల తరువాత ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తూ వెంటనే 3 లక్షల 65 వేలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆ ఉపాధ్యాయుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా అ విశ్రాంత ఉపాధ్యాయుడు గతంలో పలు జ్యోతిష్య సంస్థల నుంచి సన్మానాలు అందుకోవడంతో పాటు విద్యలో గోల్డ్ మెడల్ సంపాదించారు. 


వివరాల్లోకి వెళితే రాజ్‌గఢ్‌కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు సైబర్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో తాను ఎలా మోసపోయిందీ తెలిపాడు. అక్టోబరు 14న తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక రిక్వస్ట్ వచ్చిందని, దానిని తాను యాక్సెప్ట్ చేశానని తెలిపారు. అక్టోబరు 15న తనకు ఒక ఫోను వచ్చిందని, ఎవరో యువతి ఫోను చేసి అశ్లీలంగా మాట్లాడటంతో తాను ఫోన్ కట్ చేశానని పేర్కొన్నారు. అయితే ఆ తరువాత తనకు వాట్సాప్ నుంచి ఒక యువతి వీడియో కాల్ చేసిందని, ఆమె అశ్లీలంగా మాట్లాడుతూ, బాత్రూమ్‌లోకి వెళ్లి న్యూడ్‌గా మారిందన్నారు. దీంతో తాను వెంటనే ఫోన్ కట్ చేశానని తెలిపారు. అయితే అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో తిరిగి ఆమె వీడియో కాల్ చేసి, అదే వ్యవహారాన్ని కొనసాగించందని, వీడియో రికార్డు కూడా చేసిందని తెలిపారు. కొద్దిసేపటి తరువాత ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను నోయిడా క్రైమ్ బ్రాంచ్ ఎస్పీని అంటూ.. తన అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని, దానిని వెంటనే తొలగించుకోవాలని తెలిపారన్నారు. ఈ మాట వినగానే తనకు ఎంతో భయం వేసిందన్నారు. తరువాత ప్రమోద్ కుమార్ చెప్పిన నంబరుకు ఫోన్ చేయగా, ఆ వీడియో తొలగించాలంటే వెంటనే లక్షా 30 వేల రూపాయలు బ్యాంకుకు పంపాలని బెదిరించారు. 


దీంతో తాను ఆ మెత్తాన్ని వెంటనే బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేశానన్నారు. తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానన్నారు. అక్టోబర్ 21న తిరిగి ఫోన్ ఆన్ చేయగా, వెంటన్ ఫోన్ వచ్చిందని, ఒక గంటలో తనను అరెస్టు చేయబోతున్నామని ప్రదీప్ కుమార్ చెప్పాడని, ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే వెంటనే 2 లక్షల 35 వేల రూపాయలు తాను ఇచ్చిన బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సూచించాడన్నారు. దీంతో తాను మోసపోయానని గ్రహించానని, ఆ రిటైర్డ్ టీచర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Updated Date - 2021-10-28T17:55:55+05:30 IST