జాలరి వలకు చిక్కిన ఔషధ గుణాల చేప

ABN , First Publish Date - 2021-12-30T17:27:01+05:30 IST

పుదుకోట జిల్లా కోట్టైపట్టినం ప్రాంతానికి చెందిన ఓ జాలరి వలలో అరుదైన ఔషధ గుణాలు కలిగిన ‘కూరల్‌’ చేప చిక్కింది. ఆ చేప 33 కేజీల బరువుతో ఉంది. ఈ విషయమై అక్కడి జాలర్లు మాట్లాడుతూ సముద్రంలో ఈ

జాలరి వలకు చిక్కిన ఔషధ గుణాల చేప

                  - రూ.4 లక్షలకు అమ్మకం


చెన్నై: పుదుకోట జిల్లా కోట్టైపట్టినం ప్రాంతానికి చెందిన ఓ జాలరి వలలో అరుదైన ఔషధ గుణాలు కలిగిన ‘కూరల్‌’ చేప చిక్కింది. ఆ చేప 33 కేజీల బరువుతో ఉంది. ఈ విషయమై అక్కడి జాలర్లు మాట్లాడుతూ సముద్రంలో ఈ అరుదైన చేపలు మరపడవలలో వెళ్లే జాలర్ల వలకు సాధారణంగా చిక్కకుండా తప్పించుకుంటాయని తెలిపారు. ఈ రకం చేప తినడానికి పనికిరాదని, అయితే ఆ చేప కడుపులోని ‘నెట్టి’ అనే పేగు భాగం ఔషధ గుణాలు కలిగి వుంటాయని, ఆ ‘నెట్టి’ కోసమే ఈ రకం చేపలు అధికధరలకు అమ్ముడవుతాయని చెప్పారు. ప్రస్తుతం చిక్కిన ఈ చేపను ఓ వ్యాపారి రూ.4 లక్షల ధరకు కొనుగోలు చేశాడని వారు తెలిపారు.

Updated Date - 2021-12-30T17:27:01+05:30 IST