ట్యూషన్‌లో ఉండాల్సిన బాలిక.. అనూహ్యంగా అటవీ ప్రాంతంలో.. అపస్మారక స్థితిలో.. జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్..

ABN , First Publish Date - 2021-12-26T23:51:37+05:30 IST

పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ట్యూషన్‌కి వెళ్లింది. కానీ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కంగారుపడుతుండగా.. వారికి ఫోన్ వచ్చింది. అటవీ ప్రాంతంలో...

ట్యూషన్‌లో ఉండాల్సిన బాలిక.. అనూహ్యంగా అటవీ ప్రాంతంలో.. అపస్మారక స్థితిలో.. జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

ఇంటి నుంచి బయటికెళ్లిన ఆడపిల్ల.. క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేని రోజులివి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసే.. కుమార్తెలను బయటికి పంపించాలంటేనే తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ట్యూషన్‌కి వెళ్లింది. కానీ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కంగారుపడుతుండగా.. వారికి ఫోన్ వచ్చింది. అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నివాసం ఉంటున్న దంపతులకు పదో తరగతి చదివే కుమార్తె ఉంది. రోజూ ఉదయం స్కూల్‌కు సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో గురువారం బాలిక ట్యూషన్‌కు బయలుదేరింది. అయితే మార్గమధ్యలో ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. మాట్లాడే క్రమంలో బాలికకు డ్రగ్స్ ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే సాద్‌పుర్‌ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఆమె చనిపోయి 11నెలలు అయింది.. ఊహించని విధంగా ఇటీవల కొడుకు గదిలో మృతదేహం ప్రత్యక్షం.. చివరకు..


బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు స్థానికులు బాలికను గుర్తించి సమాచారం అందించారు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియజేసిన పోలీసులు.. ఆమెను వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మత్తు నుంచి తేరుకున్న విద్యార్థిని.. జరిగిన విషయం మొత్తం పోలీసులకు తెలియజేసింది. దీంతో ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

35ఏళ్ల వ్యక్తిని అంకుల్ అని పిలవడమే.. ఆ బాలిక తప్పయింది.. చేతులు కట్టేసి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

Updated Date - 2021-12-26T23:51:37+05:30 IST