పెళ్లి వేడుకలో సంబరాల్లో ఉండగా.. సడన్‌గా వచ్చిన అనుకోని అతిథిని చూసి షాక్.. భయంతో అంతా పరార్..!

ABN , First Publish Date - 2021-10-28T23:50:41+05:30 IST

మెక్సికోలోని వన్యప్రాణులు సంచరించే పర్వత ప్రాంతంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓ వైపు అతిథులంతా భోజనం చేస్తున్నారు. మరోవైపు కొందరు పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.

పెళ్లి వేడుకలో సంబరాల్లో ఉండగా.. సడన్‌గా వచ్చిన అనుకోని అతిథిని చూసి షాక్.. భయంతో అంతా పరార్..!

వివాహమంటే జీవితాంతం మధుర జ్ఞాపకంగా ఉండాలనుకుంటారు. అయితే మెక్సికోలో జరిగిన ఓ పెళ్లి వేడుక.. వధూవరులకే కాదు, పెళ్లికి వచ్చిన అతిథులందరికీ ఓ భయంతో కూడిన జ్ఞపకంగా మిగిలిపోయింది. పెళ్లిలో జనమంతా సంబరాల్లో ఉన్నారు. పెళ్లికొడుకు, పెళ్లికుమార్తె.. బంధువుల పలకరింపులతో బిజీగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా అందరికీ షాక్ ఇస్తూ ఓ అనుకోని అతిథి హాయ్.. అంటూ లోపలికి ఎంటరైంది. అతిథుల తరహాలో దర్జాగా లోపలికి వచ్చింది. అయితే అతిథిని పలకరించాల్సిన బంధువులంతా భయంతో పారిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. 


మెక్సికోలోని వన్యప్రాణులు సంచరించే పర్వత ప్రాంతంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓ వైపు అతిథులంతా భోజనం చేస్తున్నారు. మరోవైపు కొందరు పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. సడన్‌గా ఓ పిల్ల ఎలుగుబంటి లోపలికి వచ్చింది. బంధువులంతా భయంతో పరుగులు తీశారు. నా ఏరియాలో.. నా పర్మిషన్ లేకుండా వివాహం చేసుకుంటారా... అనుకుందో ఏమోగానీ.. లోపలికి వచ్చి టేబుల్‌పై ఉన్న తినుబండాలను పరిశీలించి, చెల్లాచెదురు చేసేసింది.


దాన్ని గమనిస్తున్న కొందరు మాత్రం అలాగే కూర్చుని ఉన్నారు. ఏమాత్రం కదిలినా ఏం చేస్తుందో అనుకుని కిక్కురుమనకుండా ఉండిపోయారు. కొద్ది సేపు హల్‌చల్ చేసిన ఎలుగుబంటి.. తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎవర్నీ ఏమీ చేయకపోవడంతో.. అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో చూసిన వారంతా...  పెళ్లి వేడుకలో ఎలుగు బంటి ఎంట్రీ.. ఎప్పటికీ గుర్తుంటుంది అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2021-10-28T23:50:41+05:30 IST