పెళ్లి మండపంపై సిద్ధంగా ఉన్న వధువు.. ఇక వరుడు రావడమే ఆలస్యం... అయితే అందుకు విరుద్ధంగా..

ABN , First Publish Date - 2021-12-29T22:12:33+05:30 IST

అది పాట్నాలోని ఓ కళ్యాణ మండంపం. పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులతో మండపం సందడి సందడిగా ఉంది. వధువు తన వైవాహిత జీవితం గురించి ఆలోచిస్తూ.. స్నేహితులతో సరదాగా ఉంది. ఇంతలో..

పెళ్లి మండపంపై సిద్ధంగా ఉన్న వధువు.. ఇక వరుడు రావడమే ఆలస్యం... అయితే అందుకు విరుద్ధంగా..
ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి మండపంపై ఎవరు లేకున్నా.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉంటే చాలు. వధూవరులిద్దరూ తాళి అనే రెండక్షరాలతో దగ్గరయ్యే మధుర క్షణాన్ని కళ్లారా చూసి, అక్షింతలు వేసి.. ఆశీర్వదించి వెళ్దామని బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా తరలివస్తుంటారు. అంతా సిద్ధంగా ఉన్న సమయంలో ఇక పెళ్లే తరువాయి.. అనుకునే క్షణంలో అనుకోని ఘటనలు జరిగితే... ఇది ఊహించడానికే ఇబ్బందిగా ఉంటుంది కదా. సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి సీన్లు.. అప్పుడప్పుడూ నిజ జీవితంలో కూడా చూస్తుంటాం. బీహార్ రాజధాని పాట్నాలో దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి మండపంపై వధువు సిద్ధంగా ఉంది. ఇక వరుడు రావడమే ఆలస్యం అనుకునే తరుణంలో వారికి ఓ కబురు వచ్చింది. వివరాల్లోకి వెళితే..


అది పాట్నాలోని ఓ కళ్యాణ మండంపం. పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులతో మండపం సందడి సందడిగా ఉంది. వధువు తన వైవాహిత జీవితం గురించి ఆలోచిస్తూ.. స్నేహితులతో సరదాగా ఉంది. ఇంతలో ముహూర్త సమయం రావడంతో పెళ్లికుమార్తెను మండపం పైకి తీసుకెళ్లారు. పురోహితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల ధ్వని మొదలవడంతో అక్కడంతా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇక వరుడు మండపం పైకి వస్తే.. తాళి కట్టడమే తరువాయి. వధువుతో పాటూ అతిథులంతా వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వరుడు రావాల్సిన తరుణంలో వారి తరపు నుంచి ఓ కబురు వచ్చింది. దీంతో మండపంలోని వారంతా షాక్ అయ్యారు.

పెళ్లైన కొన్నేళ్లకు భార్యకు వింత కోరిక.. మళ్లీ పెళ్లి చేసుకుందామనడంతో భర్త షాక్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..


వరుడి తరపు నుంచి ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ‘‘వధువు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన రూ.2లక్షలు కడితే.. అప్పుడు మా వాడు తాళి కడతాడు’’.. అంటూ ఆ వ్యక్తి అనడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. అక్కడున్న పెద్దలు కలుగజేసుకుని, ఇంతవరకూ వచ్చాక.. ఇప్పుడిలా మాట్లాడటం ఏంటి.. అంటూ నిలదీశారు. తర్వాత ఇస్తాం అంటే ఒప్పుకొని, ఇప్పుడు ఇలా చేయడం న్యాయమా.. అంటూ ఇంకొందరు ప్రాథేయపడ్డారు. అయినా వరుడి తరపువారు వినకపోవడంతో చేసేదిలేక.. వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు, అతడి తల్లిదండ్రులను స్టేషన్‌కి పిలిచి విచారించారు. కేసు దర్యాప్తులో ఉంది.

భార్య అదృశ్యం.. కొన్ని రోజులకు భర్త తమ్ముడితో ప్రత్యక్షం.. చివరకు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తే..

Read more