ప్రభుత్వ కళాశాలలో మంచి ఉద్యోగం.. ఇటీవలే పెళ్లి ఫిక్స్.. తీరా పెళ్లి దగ్గరపడుతుందనగా అతడు తీసుకున్న నిర్ణయానికి అంతా షాక్..

ABN , First Publish Date - 2021-11-27T22:02:03+05:30 IST

హర్యానాలో ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో అతడికి ఇటీవల మంచి సంబంధం కుదిరింది. రెండు కుటుంబాల వారు కలిసి ..

ప్రభుత్వ కళాశాలలో మంచి ఉద్యోగం.. ఇటీవలే పెళ్లి ఫిక్స్.. తీరా పెళ్లి దగ్గరపడుతుందనగా అతడు తీసుకున్న నిర్ణయానికి అంతా షాక్..
విక్రమ్‌సింగ్ దంపతులు

ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి సంఘంలో మంచి క్రేజ్ ఉంటుంది. చాలా మంది కూతుళ్లకు సంబంధాలు చూసే సమయంలో.. గవర్నమెంట్ జాబ్ చేసే వారికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. లక్షలకు లక్షలు కట్నాలు ఇచ్చి మరీ పెళ్లిళ్లు చేస్తుంటారు. హర్యానాలో ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో అతడికి ఇటీవల మంచి సంబంధం కుదిరింది. రెండు కుటుంబాల వారు కలిసి ఓ ముహూర్థం కూడా ఫిక్స్ చేస్తున్నారు. అయితే తీరా పెళ్లి దగ్గరపడే సమయంలో అతడు తీసుకున్న నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది... వివరాల్లోకి వెళితే..


హర్యానాలోని కైతాల్ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్.. కైతాల్ ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగం కావడంతో పెళ్లి సంబంధాలు కూడా చాలా వచ్చేవి. ఇటీవల విక్రమ్ సింగ్ తల్లిదండ్రులు ఓ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. ఇరువైపు వారు కలిసి ఓ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రూ.11లక్షలు కట్నం ఇచ్చేందుకు పెళ్లికుమార్తె తరపు వారు ముందుకొచ్చారు. విక్రమ్ సింగ్ తల్లిదండ్రులు కూడా ఇందుకు అంగీకరించారు. ఎవరికి వారు పెళ్లి పనుల్లో ఉన్నారు. ఈ క్రమంలో విక్రమ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.


అత్తింటివారు ఇచ్చే రూ.11లక్షల కట్నం తనకు అవసరం లేదని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. కట్నాల విషయంలో చాలా కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని చెప్పాడు. ఈ పద్ధతికి స్వస్తి చెప్పేందుకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చాడు. ఇదిలావుండగా, యువకుడి నిర్ణయాన్ని పెళ్లికుమార్తె స్వాగతించింది. తన భర్తలాంటి వారు సమాజంలో ఒక్కరున్నా.. అందరిలో మార్పు వస్తుందని చెప్పింది. ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనమైంది. ఈ విషయం తెలుసుకున్న చాలామంది.. విక్రమ్‌సింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2021-11-27T22:02:03+05:30 IST