ఉద్యోగం చేసి స్థిరపడతాడునుకుంటే.. అందరికీ షాక్ ఇస్తూ.. ఆ బీటెక్ స్టూడెంట్ ఇలా చేస్తాడనుకోలేదు..

ABN , First Publish Date - 2021-12-27T02:34:08+05:30 IST

బీటెక్ చదువుతున్న కొడుకుపై ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో స్థిరపడాలని ఎన్నో కలలు కన్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆ విద్యార్థి అలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు...

ఉద్యోగం చేసి స్థిరపడతాడునుకుంటే.. అందరికీ షాక్ ఇస్తూ.. ఆ బీటెక్ స్టూడెంట్ ఇలా చేస్తాడనుకోలేదు..

బీటెక్ చదువుతున్న కొడుకుపై ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో స్థిరపడాలని ఎన్నో కలలు కన్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆ విద్యార్థి అలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కర్నాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


బీహార్‌లోని పాట్నాకు చెందిన సౌరవ్ (19).. కర్నాటక ఎన్‌ఐటీకే సూరత్‌కల్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. అయితే ఇటీవల అతను తోటి విద్యార్థులతో మాట్లాడకుండా.. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఏదో బాధలో ఉన్నట్టున్నాడులే.. అనుకుని స్నేహితులు కూడా అతన్ని ఇబ్బంది పెట్టేవారు కాదు. అయితే డిసెంబర్ 26న ఉదయం సౌరవ్ స్నేహితులు.. అల్పాహారం తీసుకుని అతని గదికి వెళ్లారు. అయితే ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో కళాశాల అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. కిటికీ నుంచి చూడగా లోపల ఉరివేసుకుని కనిపించాడు.

హాయిగా సాగిపోతున్న సంసారం.. ఉన్నట్టుండి సంపు నుంచి దుర్వాసన.. చివరకు భర్త నిర్జీవంగా బయటపడడంతో..


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా ఉద్యోగం దొరకని పరిస్థితి ఉందని, చదువు కోసం కుటుంబం తీసుకున్న రుణాలను సైతం తీర్చే స్థోమత లేదని .. ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లలేకపోతున్నామని, తన అంత్యక్రియలు జరించాల్సిందిగా’’.. కుటుంబ సభ్యులు, పోలీసులను కోరుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పాట్నాకు తీసుకెళ్లడానికి ఇన్‌స్టిట్యూట్‌ సిబ్బంది, విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

ట్యూషన్‌లో ఉండాల్సిన బాలిక.. అనూహ్యంగా అటవీ ప్రాంతంలో.. అపస్మారక స్థితిలో.. జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్..

Updated Date - 2021-12-27T02:34:08+05:30 IST