ఉద్యోగం మానేస్తున్నానని చెప్పిన యువకుడు.. చివరి జీతం అడిగినందుకు యజమాని ఏం చేశాడంటే?..

ABN , First Publish Date - 2021-12-28T10:33:08+05:30 IST

మూడు నెలలుగా నెలజీతం ఇవ్వకపోవడంతో ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు ఇక పనిచేయనని యజమానికి చెప్పాడు. తనకు ఇవ్వవలసిన జీతాన్ని చెల్లించడని అడిగినందుకు.. ఆ యజమాని అతడిని దారుణంగా హత్య చేయించాడు...

ఉద్యోగం మానేస్తున్నానని చెప్పిన యువకుడు.. చివరి జీతం అడిగినందుకు యజమాని ఏం చేశాడంటే?..

మూడు నెలలుగా నెలజీతం ఇవ్వకపోవడంతో ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు ఇక పనిచేయనని యజమానికి చెప్పాడు. తనకు ఇవ్వవలసిన జీతాన్ని చెల్లించడని అడిగినందుకు.. ఆ యజమాని అతడిని దారుణంగా హత్య చేయించాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాలో జరిగింది. 

పట్నా నగరంలోని ఒక మొబైల్ ఫోన్ షాపులో వికాస్ అనే యువకుడు పనిచేసేవాడు. గత మూడు నెలలుగా జీతం ఇవ్వనందుకు పనిమానేస్తున్నానని యజమాని ఆదర్ష్ కుమార్‌తో చెప్పాడు. షాపులో వికాస్‌తో పాటు మరో ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. కానీ వికాస్ కొత్త కావడంతో అతనికి మాత్రమే జీతం ఇవ్వలేదు. దీంతో వికాస్ తనకు జీతం ఇవ్వాలని యజమానిని అడిగాడు. అప్పుడు యజమాని వికాస్‌కు కొన్ని డబ్బులు ఇచ్చి ఒక డబ్బాలో పెట్రోల్ తీసుకురమన్నాడు. ఆ తరువాత షాపులో పనిచేసే మరో కుర్రాడిని వికాస్‌ని వెంబడించమని యజమాని పంపాడు. 


వికాస్ పెట్రోల్ తీసుకొని తిరిగి వస్తున్న సమయంలో షాపులో పనిచేసే మరో కుర్రాడు.. అతనిపై దాడి చేశాడు. ఆ తరువాత పెట్రోల్ వికాస్‌పై పోసి నిప్పు పెట్టాడు. దీంతో వికాస్ శరీరం పూర్తిగా కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వికాస్ మరణించాడు. 


పోలీసులు విచారణలో వికాస్ తండ్రి రవిందర్ మాట్లాడుతూ.. "నా కొడుకు జీతం అడిగినందుకు ఆ షాపు యజమాని హత్య చేయించాడు" అని చెప్పాడు. ఈ సంఘటన తరువాత వికాస్ మిత్రులు, కుటుంబ సభ్యులు అతడి మృతదేహం తీసుకొని నడిరోడ్డుపై ధర్నా చేశారు. వికాస్ హంతకులను శిక్షించాలని, అతడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు.. చివరికి పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి వారిని వెళ్లగొట్టారు. 


ప్రస్తుతం పోలీసులు వికాస్ హత్య కేసులో షాపు యజమానిని విచారణ చేస్తున్నారు. 


Updated Date - 2021-12-28T10:33:08+05:30 IST