విమానంలో ఎకానమీ తరగతి నుచి బిజెనెస్ క్లాస్‌కు ఫ్రీగా మారాలంటే.. ఈ చిట్కాను పాటించండి

ABN , First Publish Date - 2021-10-31T12:42:45+05:30 IST

విమాన ప్రయాణం చేసే చాలా మంది మధ్యతరగతి వారికి బిజెనెస్ క్లాస్‌‌లో ఒక్కసారైనా ప్రయాణించాలని ఉంటుంది. అలాంటి వారికి ఒక చిట్కా చెప్పింది ఓ ఎయిర్ హోస్టెస్..

విమానంలో ఎకానమీ తరగతి నుచి బిజెనెస్ క్లాస్‌కు ఫ్రీగా మారాలంటే.. ఈ చిట్కాను పాటించండి

విమాన ప్రయాణం చేసే చాలా మంది మధ్యతరగతి వారికి బిజెనెస్ క్లాస్‌‌లో ఒక్కసారైనా ప్రయాణించాలని ఉంటుంది. అలాంటి వారికి ఒక చిట్కా చెప్పింది ఓ ఎయిర్ హోస్టెస్. 


ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే వారు ఉచితంగా బిజినెస్ క్లాస్‌లో కూర్చోడానికి ఒక మార్గం ఉందని అది పాటిస్తే ఈజీగా విమానంలో పెద్ద సీటు కొట్టేయొచ్చని అంటోంది హెలెనా. ఆమె ఒక అమెరికన్ ఎయిర్‌లైన్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది.


"ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్ అటెండెంట్లను మచ్చిక చేసుకొని వారిని సన్నిహితంగా పలకరించాలి.. అలా చేస్తూ తమకు ఒకసారి బిజినెస్ క్లాస్‌లో కూర్చోవాలనుందని మెల్లగా చెప్పాలి," అని హెలెనా చెప్పింది. ఫ్లైట్‌లో పనిచేసే వారు పడే శ్రమకు గురించి మాట్లాడి.. వారి సేవలు చాలా విలువైనవి అని వారిని కాస్త పొగడాలి. అంతే కాదు అప్పుడప్పడు కాస్త లంచం సమర్పించుకోవాలి. లంచం అంటే ఇక్కడ డబ్బు అనే కాదు.. ఏదో ఒక వస్తువును కానుకగా ఇవ్వడం లేదా తమ వెంట తెచ్చుకున్న ఏవైనా స్వీట్లు వారికి ఇవ్వడం వంటివి.


ఇలా ఫ్లైట్ సిబ్బందితో తరుచూ ప్రయాణించేటప్పుడు మంచి సంబంధాలు కొనసాగిస్తే వారిని బిజెనెస్ క్లాస్ గురించి అడిగితే వారు మొహమాటానికైనా కూర్చోనిస్తారని చెప్పింది. తప్పకుండా పనిజరుగుతందని హెలెనా పేర్కొంది. కానీ ఈ విషయంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఫ్లైట్ అటెండెంట్లు పెద్దగా సహాయపడకపోవచ్చని కూడా అభిప్రాయపడింది.

Updated Date - 2021-10-31T12:42:45+05:30 IST