అంబులెన్స్‌లను.. ఇలాంటి పనులకు కూడా ఉపయోగించుకుంటారా.. వీడిని ఏమనాలో మీరే చెప్పండి..

ABN , First Publish Date - 2021-11-29T00:04:29+05:30 IST

అత్యవసర సమయంలో క్షతగాత్రులను చూడగానే వెంటనే అంబులెన్స్‌లకు ఫోన్ చేస్తాం. సరైన సమయానికి వారిని ఆస్పత్రులకు చేర్చడంలో అంబులెన్స్‌లదే కీలక పాత్ర. అందుకే ఆ వాహనాలు వచ్చినప్పుడు, వెంటనే దారి ఇస్తాం.

అంబులెన్స్‌లను.. ఇలాంటి పనులకు కూడా ఉపయోగించుకుంటారా.. వీడిని ఏమనాలో మీరే చెప్పండి..
ప్రతీకాత్మక చిత్రం

అత్యవసర సమయంలో క్షతగాత్రులను చూడగానే వెంటనే అంబులెన్స్‌లకు ఫోన్ చేస్తాం. సరైన సమయానికి వారిని ఆస్పత్రులకు చేర్చడంలో అంబులెన్స్‌లదే కీలక పాత్ర. అందుకే ఆ వాహనాలు వచ్చినప్పుడు, వెంటనే దారి ఇస్తాం. అలాంటి వాహనాలను వేరే పనులకు ఉపయోగించుకుందాం అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా.. అంటే కలలో కూడా రాదు అని చెబుతాం. కానీ తైవాన్‌లో ఓ ప్రబుద్ధుడు మాత్రం అంబులెన్స్‌ సేవలను దుర్వినియోగం చేశాడు.. 


తైవాన్‌కి చెందిన వాంగ్ అనే వ్యక్తి ఆసుపత్రికి సమీపంలో నివాసం ఉంటున్నాడు. స్వతహాగా బద్ధకస్తుడు అయిన ఈ వ్యక్తి.. ఏ పని చేసినా సమస్యలు చివరికి సమస్యలు తెచ్చిపెట్టేవాడు. ఆఖరికి మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తేవాలన్నా కూడా బద్ధకించేవాడు. వారింటికి 200మీటర్ల దూరంలో మార్కెట్ ఉంది. ఓ రోజు కుటుంబ సభ్యుల బలవంతం మీద మార్కెట్‌కు వెళ్లాడు. అయితే వచ్చేటప్పుడు నడిచి రావడానికి ఇష్టపడలేదు. వెంటనే అతనికి అంబులెన్స్ గుర్తొచ్చింది. అనారోగ్యంగా ఉందంటూ అంబులెన్స్‌కు కాల్ చేశాడు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి.. అతన్ని ఆస్పత్రి వద్ద దింపేశారు. అయితే లోపలికి వెళ్లకుండా.. పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లాడు. ఇలా ఏడాదిలో 40సార్లకు పైగానే అంబులెన్స్‌ సేవలను వాడుకునేవాడు.


రోజూ ఇలా జరుగుతుండగా.. ఓ రోజు అంబులెన్స్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆస్పత్రి వద్ద దింపిన తర్వాత, అతన్ని గమనించారు. ఆస్పత్రిలోకి వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లడం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉచిత వైద్య సేవలను దుర్వినియోగం చేయడంపై అతన్ని గట్టిగా మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించేశారు.

Updated Date - 2021-11-29T00:04:29+05:30 IST