22 ఏళ్ల కుర్రాడు.. కాంట్రాక్ట్ కిల్లర్‌తో డీల్.. ప్రేయసి భర్తే టార్గెట్.. చివరకు..

ABN , First Publish Date - 2021-06-22T22:33:30+05:30 IST

తన ప్రేయసిని పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద పగ పెంచుకున్నాడు..

22 ఏళ్ల కుర్రాడు.. కాంట్రాక్ట్ కిల్లర్‌తో డీల్.. ప్రేయసి భర్తే టార్గెట్.. చివరకు..

తన ప్రేయసిని పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద పగ పెంచుకున్నాడు.. అతడిని ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.. అందుకోసం కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.. ప్రయత్నం విఫలమవడంతో పోలీసులకు చిక్కి జైలు ఊసలు లెక్కపెడుతున్నాడు.. 


ఢిల్లీకి చెందిన గుల్షన్ కుమార్ (22) గాళ్‌ఫ్రెండ్‌ను సందీప్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. తన ప్రేయసిని మర్చిపోలేకపోయిన గుల్షన్ నేరుగా సందీప్ వద్దకే వెళ్లి ఆమెను వదిలేయమని అడిగాడు. అందుకు సందీప్ అంగీకరించకపోవడంతో గుల్షన్ లక్ష రూపాయలకు నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను మాట్లాడుకున్నాడు. అందులో ఒక మైనర్ కూడా ఉన్నాడు. పథకం ప్రకారం వారు ఈ నెల 12న సందీప్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే సందీప్ తప్పించుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 


తనపై కాల్పులు జరిపింది గుల్షన్ అయి ఉంటాడని సందీప్ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు గుల్షన్‌పై నిఘా పెట్టారు. కిరాయి గూండాలతో గుల్షన్ తరచుగా ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని, కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. దీంతో వారు అసలు విషయం అంగీకరించారు. 

 

Updated Date - 2021-06-22T22:33:30+05:30 IST