డ్యూటీ నుంచి తిరిగొచ్చిన కానిస్టేబుల్.. రాత్రికి రాత్రే శవంగా.. గదిలో పగిలిన ఫోన్.. ముక్కలుముక్కలుగా యూనిఫాం..!

ABN , First Publish Date - 2021-12-17T19:10:56+05:30 IST

అతను ఓ పోలీస్ కానిస్టేబుల్.. ఎస్పీ బంగళా వద్ద కాపలా కాస్తుంటాడు.. విధులు ముగించుకుని బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లాడు..

డ్యూటీ నుంచి తిరిగొచ్చిన కానిస్టేబుల్.. రాత్రికి రాత్రే శవంగా.. గదిలో పగిలిన ఫోన్.. ముక్కలుముక్కలుగా యూనిఫాం..!

అతను ఓ పోలీస్ కానిస్టేబుల్.. ఎస్పీ బంగళా వద్ద కాపలా కాస్తుంటాడు.. విధులు ముగించుకుని బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లాడు.. తర్వాతి రోజు ఉదయానికి అతను ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు.. అతని మొబైల్ పగిలిపోయింది.. యూనిఫామ్‌ చిరిగిపోయి ఉంది.. అతని భార్యే హంతకురాలని కొందరు భావిస్తున్నారు.. అది ఆత్మహత్య అని మరకొందరు చెబుతున్నారు.. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకా బాద్‌లో ఈ ఘటన జరిగింది. 


ఫరూకాబాద్ ఎస్పీ బంగళా ఎదుట సౌరబ్ యాదవ్ అనే వ్యక్తి గార్డుగా విధులు నిర్వరిస్తున్నాడు. బుధవారం రాత్రి డ్యూటీ పూర్తయ్యాక ఇంటికి వెళ్లాడు. తర్వాతి రోజు ఉదయం భార్య లేచి చూసేసరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని మొబైల్ పగిలిపోయింది. యూనిఫామ్‌ చిరిగిపోయి ఉంది. భార్య రేష్మ ఈ హత్య చేసిందని సౌరబ్ యాదవ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 


డ్యూటీలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు, సహోద్యోగులు భావిస్తున్నారు. సౌరబ్ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని స్థానిక ఎస్ఐ చెప్పారు. 

Updated Date - 2021-12-17T19:10:56+05:30 IST