కూతురు కిడ్నాప్ అయిన పది రోజుల తర్వాత ఫిర్యాదు.. ఇంత లేట్ ఎందుకంటే ఆ తండ్రి చెప్పిన విషయం విని పోలీసులు షాక్!

ABN , First Publish Date - 2021-12-15T21:16:28+05:30 IST

రాజస్థాన్‌లోని బన్సారా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు..

కూతురు కిడ్నాప్ అయిన పది రోజుల తర్వాత ఫిర్యాదు.. ఇంత లేట్ ఎందుకంటే ఆ తండ్రి చెప్పిన విషయం విని పోలీసులు షాక్!

రాజస్థాన్‌లోని బన్సారా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.. పది రోజుల క్రితం కాలేజీ నుంచి వస్తుంటే తన కూతురు కిడ్నాప్ అయిందని ఫిర్యాదు చేశాడు.. పది రోజుల క్రితం కిడ్నాప్ జరిగితే ఇప్పటి వరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని పోలీసులు అడిగారు.. ఊరిలో పరువు పోతుందనే కారణంతో ఫిర్యాదు చేయలేదని సదరు వ్యక్తి చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. 


బేర్కాలి గ్రామ పంచాయితీకి చెందిన ఓ వ్యక్తి సోమవారం సాయంత్రం బన్సారా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు కిడ్నాప్ అయిందని ఫిర్యాదు చేశాడు. ఈ నెల 4వ తేదీన కాలేజ్ నుంచి వస్తుంటే కొందరు వ్యక్తులు తన కూతురిని బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారని చెప్పాడు. కూతురు తప్పిపోయిన పది రోజుల వరకు ఎందుకు కంప్లైంట్ చేయలేదని అతడిని పోలీసులు అడిగారు. కూతురు కిడ్నాప్ అయిందంటే ఊరిలో పరువు పోతుందనే భయంతో కంప్లైంట్ చేయలేదని చెప్పాడు. దీంతో పోలీసులు షాకయ్యారు. 


తన కూతురిని కిడ్నాప్ చేసింది ఎవరో తనకు తెలుసని, వాళ్లే ఇంటికి పంపిస్తారులే అని ఇన్ని రోజులూ ఊరుకున్నానని చెప్పాడు. పది రోజులు గడిచినా వారు తన కూతురిని విడిచి పెట్టకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చానని చెప్పాడు. దీంతో అతడి నుంచి నిందితుల వివరాలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2021-12-15T21:16:28+05:30 IST