వెల్లివిరిసిన మానవత్వం: అమర జవాన్ సోదరి పెళ్లి పనులు చేసిన CRPF jawans

ABN , First Publish Date - 2021-12-15T13:45:51+05:30 IST

సీఆర్పీఎఫ్ జవాన్లు తన తోటి అమర జవాన్ సోదరి పెళ్లి చేసి మానవత్వాన్ని చాటుకున్న ఘటన...

వెల్లివిరిసిన మానవత్వం: అమర జవాన్ సోదరి పెళ్లి పనులు చేసిన CRPF jawans

పుల్వామా దాడిలో జవాన్ మృతి...సోదరులుగా అండగా నిలిచి పెళ్లి పనులు చేసిన జవాన్లు

రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్): సీఆర్పీఎఫ్ జవాన్లు తన తోటి అమర జవాన్ సోదరి పెళ్లి చేసి మానవత్వాన్ని చాటుకున్న ఘటన ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలోని రాయ్‌బరేలీ నగరంలో వెలుగుచూసింది. 2020వ సంవత్సరం అక్టోబరులో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ మరణించాడు. తన సహోద్యోగి అయిన స్వర్గీయ శైలేంద్ర సోదరి జ్యోతి వివాహం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చేయాలని అతని కుటుంబసభ్యులు నిర్ణయించారు. అంతే తన సహోద్యోగి శైలేంద్ర లేని లోటు ఆ కుటుంబానికి తీర్చాలని భావించారు.అంతే ఉగ్రవాదుల దాడిలో హత్యకు గురైన తమ సహోద్యోగి సోదరి వివాహానికి హాజరయ్యేందుకు పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు సోమవారం రాయ్‌బరేలీకి తరలి వచ్చారు.


సోదరి జ్యోతి పెళ్లికి సోదరుడు శైలేంద్ర చేయాల్సిన జవాన్లు నిర్వర్తించారు. యూనిఫాంలో ఉన్న జవాన్లు సోమవారం పెళ్లికి సర్‌ప్రైజ్‌గా వచ్చి జ్యోతి సోదరుడు చేయాల్సిన పెళ్లి పనులన్నీ చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లు సోదరి జ్యోతిని ఆశీర్వదించారు. పెళ్లి కూతురు జ్యోతికి బహుమతులు సమర్పించారు. వధువును పెళ్లి మండపానికి జవాన్లు వెంట ఉండి సంప్రదాయబద్ధంగా తీసుకువచ్చారు. పెళ్లి వేడుకకు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు హాజరై చేసిన పనులు చూసిన అతిథులందరూ భావోద్వేగానికి గురయ్యారు.‘‘సోదరుల పాత్రను పోషిస్తున్నప్పుడు...జవాన్లు అమరవీరుడు శైలేంద్ర లేని లోటును పూరించడానికి ప్రయత్నించారు’’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు. 


‘‘నా కొడుకు ఇప్పుడు ఈ లోకంలో లేడు, కానీ ఇప్పుడు మనకు చాలా మంది కుమారులు సీఆర్‌పీఎఫ్ జవాన్ల రూపంలో ఉన్నారు, వారు ఎల్లప్పుడూ సంతోషంలో, దుఃఖంలో మాకు అండగా ఉంటారు.’’ అని శైలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి భావోద్వేగంతో చెప్పారు. Updated Date - 2021-12-15T13:45:51+05:30 IST