క‌రోనా మృతుల సంఖ్య‌లో భారీ ఉప‌శ‌మ‌నం... గ‌డ‌చిన వారంలో 45 శాతానికి త‌గ్గుద‌ల‌!

ABN , First Publish Date - 2021-06-21T13:15:03+05:30 IST

క‌రోనా వైర‌స్ సెకెండ్‌ వేవ్‌ నెమ్మదిగా మందగిస్తోంది.

క‌రోనా మృతుల సంఖ్య‌లో భారీ ఉప‌శ‌మ‌నం... గ‌డ‌చిన వారంలో 45 శాతానికి త‌గ్గుద‌ల‌!

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ సెకెండ్‌ వేవ్‌ నెమ్మదిగా మందగిస్తోంది. క‌రోనా బాధితుల‌ సంఖ్య, డెత్ రేటు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డ‌చిన వారంలో డెత్ రేటు 45 శాతానికిపైగా త‌గ్గింది. జూన్‌ 14 - 20 మ‌ధ్య కాలంలో మృతుల సంఖ్య భారీగా త‌గ్గి, రెండు వేలకు దిగువ‌గా న‌మోద‌వుతోంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల రేటు రేటు క్రమంగా తగ్గుతోంది. అయితే దీనికి రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు కేంద్రానికి త‌మ డేటాను స‌వ్యంగా పంపించ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో క‌రోనా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా రికవరీ రేటు ప్ర‌స్తుతం 95.76 శాతం ఉండగా, మరణాల రేటు 1.97 శాతంగా ఉంది. 

Updated Date - 2021-06-21T13:15:03+05:30 IST