పిల్లలు పుట్టలేదని క్షుద్రపూజులు.. ఇద్దరు సెక్స్ వర్కర్లతో ఆ పని.. చివరికి

ABN , First Publish Date - 2021-10-25T15:29:00+05:30 IST

ప్రపంచం సాంకేతిక విప్లవంతో ముందుకు సాగుతున్న ఈ రోజుల్లో.. మనదేశంలో ఇంకా మూఢనమ్మకాలు, క్షుద్రపూజులు అంటూ కొందరు అజ్ఞానం అనే అంధకారంలో పడి ఎన్నో ఘోరాలు చేస్తున్నారు...

పిల్లలు పుట్టలేదని క్షుద్రపూజులు.. ఇద్దరు సెక్స్ వర్కర్లతో ఆ పని.. చివరికి

ప్రపంచం సాంకేతిక విప్లవంతో ముందుకు సాగుతున్న ఈ రోజుల్లో..  మనదేశంలో ఇంకా మూఢనమ్మకాలు, క్షుద్రపూజులు అంటూ కొందరు అజ్ఞానం అనే అంధకారంలో పడి ఎన్నో ఘోరాలు చేస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన ఇలాంటి ఒక ఘటనలో పిల్లలు పుట్టలేదని మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు ఒక క్షుద్రమాంత్రికుడి మాటలు నమ్మి నరబలికి పాల్పడ్డారు. 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌ నగరంలో అక్టోబర్ 14న పోలీసులకు ఒక యువతి శవం దొరికింది. మృతురాలి గురించి విచారణ చేయగా.. ఆమె ఒక సెక్స్ వర్కర్ అని తెలిసింది. పోలీసులు మృతురాలి ఫోన్ కాల్ వివరాలు, శవం దొరికిన ప్రాంతంలోని సీసీటీవి వీడియోలను పరిశీలించి నీరజ్ అనే వ్యక్తిని అరెస్తు చేశారు. పోలీసులు అతడిని తమ పద్ధతిలో ప్రశ్నించగా.. నీరజ్ చెప్పిన నిజం విని పోలీసులు సైతం నిర్ఘాంత పోయారు. ఇది ఒక హత్య కాదు రెండు హత్యల కేసు అని తెలిసింది. దీంతో ఆ రెండు హత్యల కేసులో మొత్తం అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.


పోలీసుల కథనం ప్రకారం.. గ్వాలియర్ నగరానికి చెందిన బంటు బదౌరియా, మమత దంపతులకు వివాహమై 17 సంవత్సరాలైనా సంతానం కలుగలేదు. దీంతో మిత్రుడు నీరజ్‌ పర్మార్‌ సలహా మేరకు వారు ఒక భూతవైద్యడిని కలిశారు.  అతను నరబలి ఇస్తే వారి సంతాన సమస్య తీరిపోతుందని చెప్పాడు. దానికి ముందుగా మమత ఒప్పకుంది. బంటుకు ఇష్టం లేకపోయినా భార్య సంతోషం కోసం ఒప్పుకున్నాడు. 


ముందుగా నరబలి కోసం ఒక సెక్స్ వర్కర్‌ని ఎన్నుకున్నారు. నీరజ్, బంటు ఆమెను ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెకు తమతో పాటు విస్కీ తాగించారు. ఆమెతో ఇద్దరూ శృంగారం చేసి, ఆమె స్ప‌హలో లేనప్పుడు. ఆ క్షుద్రమాంత్రికుడికి వీడియో కాల్ చేశారు. అతను వీడియో కాల్‌లో మంత్రాలు చదువుతుండగా ఇక్కడ వీరిద్దరూ ఆమెను హత్య చేశారు. కానీ, తరువాత ఆ క్షుద్రమాంత్రికుడు మృతురాలి శరీరంపై ఏవో గాయాలు చూసి ఆమె బలి పనకిరాదని మరో బలి ఇవ్వాలని సూచించాడు. దీంతో ఒక వారం తరువాత మరో సెక్స్ వర్కర్‌ని ఇలాగే పిలిచి హత్య చేశారు.


ఈ సారి శవాన్ని ఊరిచివర పడేయడానికి నీరజ్, అతని గర్ల్‌ఫ్రెండ్ మీరా బైక్‌పై బయలుదేరారు. కానీ మధ్యమార్గంలో ఒక బిల్డింగ్ వద్ద శవం కింద పడిపోవడంతో అక్కడ జనం ఉన్నారని గమనించి వారిద్దరూ శవాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఆ శవం ఆధారంగానే నీరజ్‌ని పట్టుకున్నారు. నీరజ్ నిజం బయటపెట్టడంతో పోలీసులు బంటు, మమత, నీరజ్, మీరా, ఆ క్షుద్రమాంత్రికుడిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-10-25T15:29:00+05:30 IST