నెట్టింట వైరల్ అవుతున్న దంపతుల పోస్ట్.. పడక గదిలో ఆవులను చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2021-12-31T22:43:15+05:30 IST

రాజస్థాన్‌కు చెందిన దంపతులు సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. నెట్టింట ఆ దంపతులు పెట్టిన ఫొటోలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంతేకాకుండా రకరకాలు కామెంట్ చేస్తున్నారు. దీంతో దంపతులు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హ

నెట్టింట వైరల్ అవుతున్న దంపతుల పోస్ట్.. పడక గదిలో ఆవులను చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌కు చెందిన దంపతులు సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. నెట్టింట ఆ దంపతులు పెట్టిన ఫొటోలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అంతేకాకుండా రకరకాలు కామెంట్ చేస్తున్నారు. దీంతో దంపతులు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ వాళ్లు ఏం పెట్టిన పోస్ట్ ఏంటనే వివరాల్లోకి వెళితే..


హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆవును దేవుడితో సమానంగా పూజిస్తారు. అయితే.. గృహప్రవేశ సమయంలో తప్ప.. ఆవును ఇంట్లోని రానివ్వరు. కానీ పెరట్లోనే ఉంచి రకరకాల సపర్యలు చేస్తారు. ఇపుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే.. రాజస్థాన్‌‌లోని జోధ్‌పూర్‌కు చెందిన దంపతులు.. మూడు ఆవులను పెంపుడు జంతువుల్లా ఇంట్లోనే పెట్టుకుని పెంచుకుంటున్నారు. వాటి కోసం పడక గదులను ఏర్పాటు చేయడమే కాకుండా.. పరుపు మంచాలను కూడా సిద్ధం చేశారు. గోపీ, గంగా, ప్రీతు అనే పేర్లతో వాటిని ముద్దుగా పిలుచుకుంటున్నారు. తాజాగా ఆ ఆవుల కోసం ఓ ఇస్టాగ్రామం పేజీని ఓపెన్ చేసిన ఆ దంపతులు.. గోపీ, గంగా, ప్రీతూలకు సంబంధించిన ఫొటోలను అందులో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. 






Updated Date - 2021-12-31T22:43:15+05:30 IST