మొదటి పెళ్లి రోజు వేడుకలు.. భార్య, బామ్మర్దితో రెస్టారెంట్‌లో డిన్నర్ పార్టీ.. రాత్రిపూట ఒకే స్కూటీపై తిరిగొస్తోంటే..

ABN , First Publish Date - 2021-12-28T17:51:22+05:30 IST

వారికి ఏడాది క్రితం పెళ్లి జరిగింది.. మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఈ ఆదివారం ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.

మొదటి పెళ్లి రోజు వేడుకలు.. భార్య, బామ్మర్దితో రెస్టారెంట్‌లో డిన్నర్ పార్టీ.. రాత్రిపూట ఒకే స్కూటీపై తిరిగొస్తోంటే..

వారికి ఏడాది క్రితం పెళ్లి జరిగింది.. మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఈ ఆదివారం ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.. రాత్రికి ఏదైనా హోటల్‌కు వెళ్లి డిన్నర్ చేయాలనుకున్నారు.. ఆ డిన్నర్‌కు బావమరిది కూడా హాజరయ్యాడు.. సంతోషంగా భోజనం చేసి ముగ్గురూ ఒకే స్కూటీపై ఇంటికి బయల్దేరారు.. ఇల్లు చేరక ముందే వారిని ఓ వాహనం ఢీకొట్టింది.. ముగ్గురూ తుదిశ్వాస విడిచారు.. ముంబైకు సమీపంలోని థానేలో ఈ ఘటన జరిగింది. 


థానేలో మెడికల్ షాప్ నడుపుతున్న వీర్మారామ్ గతేడాది డిసెంబర్ 26న పాలికి చెందిన మీనాను వివాహం చేసుకున్నాడు. గత ఆదివారంతో వీరి వివాహం జరిగి ఓ ఏడాది పూర్తయింది. దీంతో ఆ రోజును వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. రాత్రి షాప్ మూసేసిన తర్వాత సమీప ధాబాకు వెళ్లి డిన్నర్ చేయాలనుకున్నారు. డిన్నర్ పార్టీకి మీనా సోదరుడు హేమరాజ్‌ను కూడా ఆహ్వానించారు. ముగ్గురూ కలిసి ధాబాకు వెళ్లి భోజనం చేశారు. అనంతరం ఒకే స్కూటీపై ఇంటికి బయల్దేరారు. 


మార్గమధ్యంలో ఓ గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఆ యాక్సిడెంట్‌ను ఎవరూ గుర్తించలేదు. తెల్లవారు ఝామున 3 గంటలకు ఓ బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన పడి ఉన్న వీరిని గుర్తించాడు. అతను చూసేటప్పటికి హేమరాజ్, వీర్మారామ్ ప్రాణాలు కోల్పోయారు. మీనా కొనప్రాణంతో ఉంది. వెంటనే ఆమెను హస్పిటల్‌కు తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆమె సోమవారం మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.  

Updated Date - 2021-12-28T17:51:22+05:30 IST