సరిగ్గా ఏడాది క్రితం కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై.. ఇంట్లో కూర్చునే నెలకు రూ.కోటి సంపాదన.. ఇంతకీ ఈ యువతి ఏం చేస్తోందంటే..

ABN , First Publish Date - 2021-12-08T23:14:40+05:30 IST

ఆమె కార్పొరేట్ సంస్థలో ఉద్యోగి. నెలకు లక్షల్లో జీతం.. అయినా ఏదో తెలియని వెలితి.. ఇంకేదో చేయాలన్నా తపన. ఆశయం వైపు అడుగులు వేయాలని ఆమె నిర్ణయించుకుంది. దీంతో సరిగ్గా ఏడాది క్రితం జాబ్‌కు

సరిగ్గా ఏడాది క్రితం కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై.. ఇంట్లో కూర్చునే నెలకు రూ.కోటి సంపాదన.. ఇంతకీ ఈ యువతి ఏం చేస్తోందంటే..

ఇంటర్‌నెట్ డెస్క్: ఆమె కార్పొరేట్ సంస్థలో ఉద్యోగి. నెలకు లక్షల్లో జీతం.. అయినా ఏదో తెలియని వెలితి.. ఇంకేదో చేయాలన్నా తపన. ఆశయం వైపు అడుగులు వేయాలని ఆమె నిర్ణయించుకుంది. దీంతో సరిగ్గా ఏడాది క్రితం జాబ్‌కు గుడ్‌బై చెప్పింది. అంతకుమించి సంపాదించే ఆలోచనలు చేసింది. అపుడే ఆమెకు ఓ ఆలోచన తట్టింది. ఆ ఆలోచనకు కార్యరూపం దాల్చి.. ఇపుడు ఇంట్లో కూర్చునే నెలకు రూ.కోటి సంపాదిస్తోంది. ఇంతకీ ఈ యువతి ఏం చేస్తోందనేది తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..


కాట్ నార్టాన్ అనే 27 ఏళ్ల యువతి కార్పొరేట్ ఉద్యోగం చేసేది. అక్కడ ఆమెకు జీతం లక్షల్లో వచ్చినా తృప్తి చెందలేదు. ఏదో సాధించాలనే కోరికతో ఆ ఉద్యోగం మానేసింది. అప్పటినుంచి ఏం చేయాలి? అని ఆలోచించడం మొదలెట్టింది. అలా ఆమెకు తట్టిన ఓ ఆలోచనే ఇప్పుడు రూ. కోట్ల సంపాదన తెచ్చిపెట్టి నార్టాన్ జీవితాన్నే మార్చేసింది. మెక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ షీట్స్‌‌కు సంబంధించిన అంశాలను నేర్పించేందుకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చాలా మంది ట్యూటర్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఈ అంశాలను సులభ పద్ధతుల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేవాళ్లు చాలా అరుదు. ఈ క్రమంలో నార్టాన్ దాన్ని అత్యంత సులభంగా బోధించే మార్గాలు కనిపెట్టి.. ఆ అతికొద్ది మంది జాబితాలో చేరిపోయింది. MS Excel టిప్స్, గూగుల్ షీట్స్‌ నియమాలను వైరల్ వీడియోగా రూపొందించి వాటిని ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్ యాప్స్‌లో @miss.excel అనే బ్లాగర్‌ పేరుతో పోస్ట్ చేసింది. 


మైక్రోసాఫ్ట్ ఎక్సల్ ప్రోగ్రామ్‌లు, గూగుల్ షీట్స్‌పై నార్టన్ చేసిన వీడియోలు నచ్చడంతో అనేక మంది ఆమెను ఫాలోకావడం మొదలు పెట్టారు. నవంబర్ 2020లో సరదాగా ఆన్‌లైన్ టీచింగ్ బిజినెస్‌ను ప్రారంభించి.. ఏడాది తిరిగేసరికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లని సంపాదించుకుంది. దీంతో కాసుల వర్షం కురవడం ప్రారంభమైంది. నెలకు ఏకంగా కోటి రూపాయలను సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం కాట్ నార్టన్ ఫుల్ టైం ట్రైనర్‌గా మారిపోగా.. ఆమె ప్రియుడు కూడా ఉద్యోగం మానేసి నార్టన్‌కు సహాయం చేస్తున్నాడు.

Updated Date - 2021-12-08T23:14:40+05:30 IST