నడుస్తున్న రైలు నుంచి దిగబోయి కిందపడిన Pregnant Woman...వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-10-19T13:17:42+05:30 IST

కదులుతున్న రైలు నుంచి దిగబోయిన ఓ గర్భిణి జారి కిందపడగా అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఆర్ ఖండేకర్...

నడుస్తున్న రైలు నుంచి దిగబోయి కిందపడిన Pregnant Woman...వీడియో వైరల్

కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్...

ముంబై : కదులుతున్న రైలు నుంచి దిగబోయిన ఓ గర్భిణి జారి కిందపడగా అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఆర్ ఖండేకర్ కాపాడిన ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వేస్టేషనులో జరిగింది. వందన అనే 21 ఏళ్ల గర్భిణీ, తన భర్త చంద్రేశ్, కూతురితో కలిసి కల్యాణ్ రైల్వేస్టేషను నుంచి గోరఖ్ పూర్ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. అయితే వారు పొరపాటున వేరే రైలు ఎక్కారు. వారు దీన్ని తెలుసుకొని ఆ రైలు దిగే సమయానికి వారు ఎక్కిన రైలు కదలడం ప్రారంభించింది. 8నెలల గర్భవతి అయిన వందన కదిలిన రైలు దిగబోయి కిండపడింది. అంతే సరిగ్గా అక్కడే విధుల్లో ప్లాట్ ఫాంపై ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఆర్ ఖండేకర్ ఆమెను కాపాడారు. 


రైలు, ప్లాట్ ఫారమ్ మధ్య ఖాళీలో మహిళ పడకుండా కాపాడినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన గర్భిణీ తిరిగి తన కుటుంబంతో కలిసి గోరఖ్ పూర్ రైలు ఎక్కింది.కదులుతున్న రైలు నుంచి దిగబోయి కిందపడిన గర్భిణీ సీసీటీవీ ఫుటేజీని ముంబైలోని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ ట్వీట్ లో పోస్టు చేశారు.ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రయాణికులు రన్నింగ్ రైల్లో ఎక్కవద్దు లేదా దిగవద్దని ట్వీట్ లో సూచించారు.

Updated Date - 2021-10-19T13:17:42+05:30 IST